NTV Telugu Site icon

Bhadradri Temple : భద్రాద్రి ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం.. ఇద్దరు అర్చకులకు మెమోలు

Bhadrari

Bhadrari

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలోనీ ఆలయ సిబ్బంది గత కొంతకాలంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆలయ అధికారులు ఇద్దరు అర్చకులకు మెమోలు జారీ చేశారు. సీతారాములకు శనివారం సాయంత్రం జరిగిన సార్వభౌమ సేవలో హాజరుకాని ఇద్దరు అర్చకులకు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే గత కొంతకాలంగా ఆలయ సిబ్బంది వారి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని స్వామివారికి జరిగే సేవలో ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా ఉత్సవాలు చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.. స్వామివారికి ప్రతీ నిత్యం జరిగే సేవల్లో సరైన సమయానికి హాజరు కాకపోవడం వల్లనే ఇద్దరు అర్చకులకు మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : Ravanasura: ఇప్పటివరకూ రవితేజని హీరోగా చూశారు… ఇకపై ‘రావణాసుర’గా చూస్తారు

ముఖ్యమైన ప్రధానార్చకులు ఈ విషయం పై ఆలయ అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. సీతారామ కల్యాణ పనులు ఈనెల 7న పాల్గున పౌర్ణమి నాడు శ్రీకారం చుట్టునున్నారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రోలు, రోకలికి పూజలు చేసి పసుపు కొమ్ములు దంచి పనులు ప్రారంభిస్తారు. తదుపరి సీతారాముల కల్యాణానికి వాడే తలంబ్రాలను తయారు చేస్తారు. అదే రోజు డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలు నిర్వహించనున్నారు.ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని చిత్రకూట మండపంలో నిర్వహించే ఆలయ అధికారులు… ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని భావించి ఉత్తర ద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో కల్యాణానికి వాడే తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి కానీ భద్రాద్రి రామయ్య సన్నిధిలో వాడే తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి.

Also Read : Kushi: లవ్ స్టొరీ కదా సార్… పీటర్ హెయిన్స్ తో ఫైట్ ఎందుకు?

Show comments