Best Battery Smartphones: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం వెతికే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎక్కువ గంటల పాటు మొబైల్ ను వినియోగించడం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వాడకం వంటి అంశాల వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోంది. ఇలాంటి సందర్భాల్లో వేగంగా ఛార్జ్ అయ్యే, అలాగే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఫోన్ల కోసం వినియోగదారులు చూస్తున్నారు. మరి అలంటి వారికి రూ. 20,000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ బ్యాటరీ ఫోన్ల వివాలను చూద్దాం.
Read Also: Story Board: అహ్మదాబాద్ ఘటన తర్వాత తీరు మారలేదా..? ప్లేన్ ఎక్కే ప్రయాణికుడికి భరోసా ఏది..?
Redmi Note 14 5G:
Redmi Note 14 5G ఫోన్ 5110mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది 0 నుండి 100% వరకు చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఈ మొబైల్ లో 6.77 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. MediaTek Dimensity 7025 Ultra ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్లో 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 20MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రూ. 17,999 ధరకు 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది. డిస్ప్లే క్లారిటీ, పనితీరు, ఇంకా బ్యాటరీ లైఫ్ అన్నింటిలోనూ బ్యాలెన్స్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఎంపిక.

Read Also: Nara Lokesh: ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలు..
Vivo T4x 5G:
Vivo T4x 5G ఫోన్ 6500mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది చాలా కాలం బ్యాకప్ ఇస్తుంది. దీనికి 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. ఇక మొబైల్ లో 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుతుంది. దీంట్లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ వాడారు. దీని ధర కేవలం రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కువ సేపు ఫోన్ వాడే వారికి, ఎక్కువ బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

OnePlus Nord CE4 Lite 5G:
ఈ ఫోన్ 5500mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. దీని ప్రత్యేకత 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్. కేవలం 30 నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక ఇందులో 6.72-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలదు. దీనిలో Snapdragon 695 5G ప్రాసెసర్ ఉంది. ఈ మొబైల్ ధర రూ. 17,998 కే 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. వేగంగా ఛార్జ్ అయ్యే ఫోన్, స్టైలిష్ డిజైన్, మంచి డిస్ప్లే కోసం చూస్తున్న వారికి ఇది సరైన ఎంపిక.
