బెంగుళూరులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దారుణంగా వ్యవహరించాడు. రక్షించే వాడే భక్షించే వాడైన్నట్లుగా ప్రవర్తించాడు. బైక్ చెక్ చేయాల్సిన కానిస్టేబుల్ రైడర్ పై చేయిచేసుకున్నాడు. కారణం లేకుండానే అతడిపై చేయిచేసుకోవడంతో.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో తెగ వైరల్ అవుతుంది.
Read Also:Viral Video: మీరెక్కడి మనుషులురా బాబు.. తినే తిండి మీద ఊయమేంట్రా..
సిల్క్ బోర్డ్ జంక్షన్ సమీపంలో వన్ వేకు ఎదురుగా ప్రయాణించాడు ఓ ప్రయాణికుడు. బైక్ ఆపి ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేసాడు మడివాలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున తేలి. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసులకు సీనియర్ అధికారులు వన్ వే వైపు ప్రయాణించే వాహనదారులకు సంబంధించి మౌఖిక సూచనలు ఇచ్చారు. ఉదయం 11 గంటల తర్వాత సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్ కింద ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వన్ వే వైపు వెళుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గమనించడంతో డ్రైవ్ ప్రారంభమైంది.
Read Also:Types of Anesthesia: అసలు అనస్థీషియా ఎందుకు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారో మీకు తెలుసా?
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఇలాంటి ప్రవర్తనతో ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి, ప్రజల సేవకులుగా ఉండాల్సిన వారు వీధిరౌడీలా రెచ్చిపోయి చేయి చేసుకోవడం సిగ్గుచేటు అని నెటిజన్‌లు కామెంట్లు చేశారు. బైకర్ వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోతే బైక్ స్వాధీనం చేసుకోవాలి.. కానీ ఇలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన వారు, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ విచారణకు ఆదేశించారు.
"Accountability and respect go hand-in-hand. Action taken against staff for misbehavior" https://t.co/Dlu3pPmhsE
— DCP SOUTH TRAFFIC (@DCPSouthTrBCP) October 15, 2025