Hema : సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు పట్టుబడ్డారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also:Viral Video : మీరు బైక్ నడుపుతారు సరే.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ
ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా భాగమైందని వార్తలు వైరల్ అవుతోంది. ముఖ్యంగా కన్నడ మీడియాలో నటి హేమ పేరు మార్మోగిపోతుంది. దీంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హేమ ఓ వీడియోను విడుదల చేసింది.
Read Also:Akshay Kumar : తొలిసారి ఓటు వేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?
‘‘నేను ఏ నగరానికి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఇక్కడ నా ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. నాపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. అదంతా ఫేక్ న్యూస్. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నా మీద వస్తున్న వార్తలను నమ్మకండి’ అని హేమ కోరారు.