Site icon NTV Telugu

RCB Stampede: తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై కేసు నమోదు..

Rcb Victory Parade

Rcb Victory Parade

ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులో సంభవించిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తొక్కిసలాట ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిందితులుగా చేర్చారు. మరోవైపు మెజిస్టేరియల్ విచారణలో భాగంగా ఇప్పటికే వారికి అధికారులు నోటీసులను జారీ చేశారు.

READ MORE: Ambati Rambabu : నాపై తప్పుడు కేసు నమోదు చేశారు.. ఆ సీఐని వదిలి పెట్టను..!

తాజాగా ఈ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. తొక్కిసలాట ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరించింది. ఘటన సమయంలో చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో 1000 మందికి పైగా పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నట్లు తెలిపింది. అయితే, అంతకుముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. ఆర్సీబీ ఈవెంట్‌కు 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పడం గమనార్హం. ‘‘వేడుక కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం విషాదంగా మారింది. ఈ దుర్ఘటన వెనుక కారణాలను తేల్చాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలను మనం నివారించగలమా? భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయగలం? అన్నవి ఆలోచించాలి’’ అని కోర్టు అభిప్రాయపడింది.

READ MORE: PV Sindhu: ఇండోనేషియా ఓపెన్‌ సూపర్ 1000 నుంచి పీవీ సింధు అవుట్..!

Exit mobile version