New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య రవాణా కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తూ బెంగళూరు-ముంబై నగరాల మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. గత 30 ఏళ్ల కాలంలో ఈ రెండు ప్రధాన మెట్రో నగరాల మధ్య ఒక కొత్త రైలును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అరుదైన వేడుకలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త రైలు సర్వీసు (నంబర్లు 16553/16554) బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) నుంచి ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) మధ్య వారానికి రెండు రోజులు (బై-వీక్లీ) నడవనుంది.
త్వరలోనే వందే భారత్ స్లీపర్ సర్వీస్..
ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ.. ఉత్తర, దక్షిణ కర్ణాటక ప్రజల దశాబ్దాల నాటి సుదీర్ఘ నిరీక్షణకు, రవాణా డిమాండ్లకు ఈ రైలు ద్వారా పరిష్కారం లభించిందన్నారు. అంతేకాకుండా, ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత ఆధునిక ‘వందే భారత్ స్లీపర్’ రైలు సర్వీసును కూడా బెంగళూరు-ముంబై మధ్య అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
గడిచిన కొన్నేళ్లలో కర్ణాటక రాష్ట్రానికి కేంద్రం నుంచి రైల్వే నిధుల కేటాయింపు గణనీయంగా పెరిగిందని, దీనివల్ల పెండింగ్ ప్రాజెక్టుల పనులు వేగవంతమయ్యాయని మంత్రి తెలిపారు. 2014 నుండి ఇప్పటివరకు కర్ణాటకలో దాదాపు 1,750 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయింది. అత్యంత సంక్లిష్టమైన హాసన్-మంగళూరు సెక్షన్లో విద్యుద్దీకరణ పనులు పూర్తయి, ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి.
రాష్ట్రంలోని 61 రైల్వే స్టేషన్లను రూ.2,160 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నారు. ఇందులో భాగంగా బెంగళూరు కాంటోన్మెంట్ స్టేషన్‌ను రూ.485 కోట్లతో, యశ్వంతపూర్ స్టేషన్‌ను రూ.367 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్ట్ పరిధిలోని నాలుగు కారిడార్ల పనులు వేగంగా సాగుతున్నాయని, ఇది పూర్తయితే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ఐటీ హబ్‌లకు రవాణా మరింత సులువు కానుందని మంత్రి వివరించారు.
తాజావార్తలు
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!