Man Bites Traffic Police Finger in Bengaluru: భారత దేశంలో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే.. చాలా మంది పారిపోవడానికి ప్రయత్నిస్తారు. తప్పించుకోవడానికి వెల్లేకపోతే.. ఏదో ఓ కారణం చెప్పి అక్కడినుంచి బయటపడుతుంటారు. కానీ వ్యక్తి ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు. ఈ ఘటన బెంగుళూరులోని విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వివరాల ప్రకారం… సయ్యద్ సఫీ అనే 28 ఏళ్ల యువకుడు విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ సమీపంలో హెల్మెట్ లేకుండా స్కూటీని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇది చూసిన ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ఒక కానిస్టేబుల్ స్కూటర్ కీని తీసుకోగా.. అతడు వాగ్వాదానికి దిగాడు. దాంతో హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజలగి ఈ ఘటనను రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. దాంతో ఇద్దరిని ఎదురించాడు. ఓ దశలో కీని తీసేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలిని కొరికాడు.
Also Read: JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్ 2024 ఫలితాలు.. 10 మంది తెలుగు విద్యార్థులకు 100 శాతం స్కోరు!
ఆపై సయ్యద్ సఫీ పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దుర్భాషలాడడం, శారీరకంగా గాయపర్చడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సమందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాను ఆసుపత్రికి వెళ్లే తొందరలో హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయానని, వీడియో వైరల్గా మారితే తాను పట్టించుకోనని సయ్యద్ సఫీ చెప్పడం వీడియోలో వినపడుతోంది.