NTV Telugu Site icon

Bengaluru Murder Case: ఆత్మరక్షణ కోసం చంపేశా.. డెత్ నోట్‌లో రాసుకున్న నిందితుడు

Bengaluru Murder

Bengaluru Murder

బెంగళూరులో రిఫ్రిజిరేటర్‌లో ముక్కలు ముక్కలుగా నరికి మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడి నుండి పోలీసులు డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను ఆత్మరక్షణ కోసం చంపినట్లు రాశాడని తెలిపారు. బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో మహాలక్ష్మి మృతదేహాన్ని 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు నిందితుడు ముక్తి రంజన్ రాయ్.. కాగా.. హత్య అనంతరం సెప్టెంబర్ 25 న ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహాలక్ష్మి మృతదేహాన్ని గుర్తించిన 4 రోజుల తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు.

National Film Awards: బెస్ట్ తెలుగు సినిమాగా కార్తికేయ 2.. బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి

తన డెత్ నోట్‌లో, మహాలక్ష్మి తనను చంపాలని ముందే ప్లాన్ చేసిందని.. అంతేకాకుండా తన మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి పారేయాలని అందులో ఉన్నట్లు రాయ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో.. అతను తనను తాను రక్షించుకోవడానికి ఈ చర్యకు పాల్పడ్డాడు.. మహిళ గొంతు నులిమి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాయ్ తన ఇంట్లోనే మహాలక్ష్మిని హత్య చేశాడు. మరుసటి రోజు అతను కొడవలి తీసుకుని వచ్చి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోశాడు. ఆ తర్వాత ఆ ముక్కలను రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి ఇంటిని శుభ్రం చేశాడు. అయితే.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోలేదని, అయితే కొడవలిని విక్రయించిన మహిళ దానిని కొనుగోలు చేసిన వ్యక్తిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Minister Satya Kumar Yadav: ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ.. ఒప్పందంపై సంతకాలు

బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. మహాలక్ష్మి, రాయ్ బెంగళూరులోని ఓ మాల్‌లో పనిచేసి స్నేహితులుగా మారారు. 29 ఏళ్ల మహాలక్ష్మికి వివాహమైనప్పటికీ విడిగా ఉంటోంది. ఆ తర్వాత వారు ఒక సంబంధంలోకి ప్రవేశించారు. అయితే, మహాలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని రాయ్‌పై ఒత్తిడి తెచ్చిందని, ఈ వివాదం వారి మధ్య నిత్యం వాగ్వాదానికి దారితీసిందని పేర్కొంది. మహాలక్ష్మిని హత్య చేసిన తర్వాత, రాయ్ మూడు రోజుల తర్వాత ఒడిశాలోని తన ఇంటికి వెళ్లి, తన తల్లి ముందు నేరాన్ని అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. మహాలక్ష్మిని తానే హత్య చేశానని రాయ్ తన తల్లి ముందు బోరున విలపించాడు. అలాగే మహాలక్ష్మి కోసం తాను చాలా డబ్బు ఖర్చు పెట్టానని, అయితే ఆమె ప్రవర్తన తన పట్ల బాగా లేదని తన తల్లికి చెప్పాడు. సెప్టెంబర్ 2-3 తేదీల మధ్య మహాలక్ష్మి హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె మృతదేహాన్ని ఆమె తల్లి సెప్టెంబర్ 21న గుర్తించారు.