బెంగళూరులో రిఫ్రిజిరేటర్‌లో ముక్కలు ముక్కలుగా నరికి మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడి నుండి పోలీసులు డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను ఆత్మరక్షణ కోసం చంపినట్లు రాశాడని తెలిపారు. బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో మహాలక్ష్మి మృతదేహాన్ని 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు నిందితుడు ముక్తి రంజన్ రాయ్.. కాగా.. హత్య అనంతరం సెప్టెంబర్ 25 న ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.