Site icon NTV Telugu

Bengaluru: అద్దెకు ఇల్లు కావాలా..? రూ. 23 లక్షలు డిపాజిట్ చేయండి..!

Bengaluru

Bengaluru

Bengaluru: ప్రస్తుతం ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే.. సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా మారుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాలలో ఇంటి యజమానులు ప్రస్తుతం డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి ఇలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. 4BHK ఇంటికి సెక్యూరిటీ డిపాజిట్ కోసం యజమాని రూ. 23 లక్షలు డిమాండ్ చేశారు.

READ MORE: Honour killing: అన్నకు ఇష్టం లేని పెళ్లి.. యువ జంటను చంపేసిన కుటుంబం.. కన్నీరుపెట్టిస్తున్న పాక్ ‘‘పరువు హత్య’’

కాలేబ్ అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ 4BHK ఇంటి నెలవారీ అద్దె రూ. 2.3 లక్షలు. కానీ.. ఇంటి యజమాని సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 23 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఇది 12 నెలల అద్దెకు సమానమని పోస్ట్‌లో పేర్కొన్నారు. అనంతరం ఆ యూజర్.. ప్రపంచంలోని న్యూయార్క్, టొరంటో, సింగపూర్, లండన్, దుబాయ్ వంటి పెద్ద నగరాలతో పోల్చి వివరించారు. ఈ దేశాల్లో అద్దెలో 5 నుంచి 10 శాతం మాత్రమే డిపాజిట్ చేయమని అడుగుతారని.. భారత్‌లోని బెంగళూరు ఇంటి యజమానులు ప్రపంచంలోనే అత్యంత దురాశపరులని పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే.. ఈ పోస్ట్‌లో ఫొటోలను సైతం పోస్ట్ చేశారు. ఈ ఫొటోల ప్రకారం.. ఇది నోబ్రోకర్ యాప్‌లో యజమాని ఈ వివరాలు ఉంచారు. దీన్ని కాలేబ్ అనే యూజర్ హైలెట్ చేశారు. ఈ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

READ MORE: Bhatti Vikramarka: తెలంగాణ మోడల్ ను దేశం ఫాలో అవుతుంది..

Exit mobile version