Heavy Rain: బెంగళూరులో భారీ వర్షం.. 133 ఏళ్ల రికార్డు బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసిముద్దైంది. ఈ క్రమంలో.. బెంగళూరు నగరానికి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన రెండు రోజుల్లోనే.. బీభత్సమైన వర్షం కురిసింది. ఈ క్రమంలో.. జూన్‌లో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షపాతంతో 133 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
Read Also: Arvind Kejriwal: మళ్లీ తీహార్ జైలు కి కేజ్రీవాల్
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
జూన్‌లో ఆదివారం ఒక్క రోజు కురిసిన అత్యధిక వర్షపాతంతో 133 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. బెంగళూరులో ఆదివారం 111.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని.. ఇది జూన్ నెలలో కురవాల్సిన సగటు కంటే ఎక్కువ అని వాతావరణ శాఖ పేర్కొంది. ఇంతకుముందు బెంగళూరులో 1891 జూన్ 16న 101.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా.. జూన్ 3 నుండి 5 వరకు ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also: Stock Market: కొత్త ఊపు తెచ్చిన ఎగ్జిట్ పోల్స్.. ఆల్ టైమ్ లాభాల్లో సూచీలు
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బెంగళూరులో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో.. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పర్పుల్ మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీళ్లు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు నగరంలో అత్యధికంగా హంపి నగర్లో 110.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. తర్వాత మారుతి మందిర వార్డు (89.50 mm), విద్యాపీఠ్ (88.50 mm), కాటన్‌పెట్ (87.50 mm)లో వర్షం కురిసింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!