కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసిముద్దైంది. ఈ క్రమంలో.. బెంగళూరు నగరానికి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన రెండు రోజుల్లోనే.. బీభత్సమైన వర్షం కురిసింది. ఈ క్రమంలో.. జూన్‌లో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షపాతంతో 133 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.