Telia Bhola Fish: రాత్రికి రాత్రే మారిన జాలర్ల జాతకం.. ఆ ఒక్కటి వారి జీవితాన్ని మార్చేసిందిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telia Bhola Fish: ఒక్కోసారి ఈ ఏడాది మనకు అస్సలు బాలేదు. కాలం కలిసి రాలేదు అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుుడే మెరుపులా భలే ఛాన్స్ దొరికితే రాత్రికి రాత్రే కష్టం తీరిపోతే సూపర్ గా ఉంటుంది కదా. అలాగే జరిగింది పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు జాలర్లకు. ఖరీదైన చేపలు దొరికి జాలర్ల జీవితం మారిపోయింది అనే వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం.ఇలాంటివి ఎక్కువ వెస్ట్ బెంగాల్ లోనే జరుగుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం చేపలకు చాలా ఫేమస్. దేశంలో ఎక్కువ చేపలు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ చాలా మంది చేపల వేటపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తారు. వీరిలో కొంతమంది వలలో కొన్ని ఖరీదైన చేపలు పడి రాత్రికి రాత్రే వారి జీవితాన్ని మార్చేస్తాయి. తాజాగా మళ్లీ అలానే వెస్ట్ బెంగాల్ లోని కొంతమంది జాలర్ల జీవితం మారిపోయింది.
Also Read: Sunday: ఆదివారం పుట్టిన వారి లక్షణాలు.. ఆ ఒక్కటే వారిలో మైనస్
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
సాధారణంగా ప్రతి ఏడాది హిల్సా(పులసచేపలు) చేపల ఉత్పత్తిపైనే వారి ఆదాయం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దిఘా ఈస్ట్యూరీ ఫిష్ వేలం కేంద్రంలో ఏటా హిల్సా చేపల వేలం జోరుగా సాగుతుంది. ఇది తూర్పు భారతదేశంలో అతిపెద్ద సముద్రపు చేపల వేలం కేంద్రం. ఇక్కడి నుంచే విదేశాలకు చేపలను ఎగుమతి చేస్తారు. అయితే ఈ ఏడాది సరిగ్గా హిల్సా చేపలు వచ్చే సమయంలో వేడి వర్షాలు కురవడంతో వాటి ఉత్పత్తి ఘణనీయంగా తగ్గింది. దీంతో మత్స్యకారుల ఆదాయానికి గండిపడింది. దిగాలుగా ఉన్న వారిని అనుకోని అదృష్టం వరించింది.
“తెలియా భోలా” చేపల రూపంలో వారి కష్టం తీరింది. లక్షల విలువ చేసే ఈ చేపలు మొత్తం 9 మత్స్యకారులకు లభించాయి. వీటి రేటు వింటే అవాక్కావ్వాల్సిందే. కేజీ రూ.31 వేలు వరకు ఉంటుంది. ఒక్కో చేప బరువు దాదాపు 25-30 కేజీలు ఉంటుంది. అంటే వీటి ధర కొన్ని లక్షల్లో ఉంటుంది. వీటికి ఎంత గిరాకీ ఉంటుందంటే జాలర్లు తెచ్చిన రోజే మొత్తం చేపలు అమ్ముడైపోయాయి. వీటిని ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ చేపలోని కొన్ని భాగాలను మందుల తయారీలో ఉపయోగిస్తారు.ఈ చేప పేగులను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ప్రపంచ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇవి సాధారణంగా దొరకవు ఎందుకంటే సముద్రంలో లోపల ఇవి జీవిస్తూ ఉంటాయి. ఇక హిల్సా చేపలు దొరకక సతమతమవుతున్న జాలర్లకు తెలియా భోలా చేపల రూపంలో ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!