NTV Telugu Site icon

Coconut Oil : వావ్‌.. పరగడుపున కొబ్బరినూనె తాగితే ఇన్ని ప్రయోజనాలా..!

Coconut Oil

Coconut Oil

నేటి ఆధునిక యుగంలో మారుతున్న ఆహారపుటలవాట్లు, ప్రకృతిలో చోటు చేసుకున్న మార్పులతో పాటు పలు కారణాల వలన మనల్ని పలు రకాలైన అనారోగ్యాలు వెన్నంటే ఉంటున్నాయి. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయినా ఆదిలోనే హరించే దివ్య ఔషధము కొబ్బరి నూనె అని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతిరోజు ఉదయం పూట రెండు స్పూన్ల కొబ్బరి నూనె తాగితే పలు రోగాలు మటుమాయం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తినే తిండిలో ఇరవై శాతం మార్పు చేసినా.. ఎంతో చక్కగా సన్న బడతారు అయితే ఎలాంటి మార్పు చేయాలి? తినే తిండిలో ఎలాంటి మార్పులు చేయడం వల్ల శరీరంలోని కొవ్వు పూర్తిగా చేస్తుందో తెలుసుకుందాం.
Also Read : Drinking Water: రోజూ రెండు లీటర్ల నీరు త్రాగాల్సిన అవసరం ఉందా?

అధిక బరువు తగ్గడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే పద్ధతి చాలా సహజసిద్ధమైన పద్ధతి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనె ఈ విధంగా తీసుకుంటే అధిక బరువు సులువుగా తగ్గుతారు. అన్నం వండేటప్పుడు ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి వండితే కొబ్బరి నూనెలో ఉండే మంచి కొవ్వు పదార్థాలు ఆకలిని తగ్గిస్తాయి. అంతేకాకుండా కొద్దిగా వేడి నీటిలో అర్చక నిమ్మరసం, ఒక స్పూన్ కొబ్బరి అందుకనే కలిపి తీసుకుంటే చాలు. ఇది మరి పరగడుపున కాకపోయినా ఏదైనా తినడానికే అరగంట ముందు తీసుకోవచ్చు.
Also Read : Motion sickness Tips : జర్నీల్లో వచ్చే వాంతులను తగ్గించే చిట్కాలు

వండే వంటల్లో కొద్దిగా కొబ్బరి నూనె చేర్చాలి. అంటే టిఫిన్‌లలో వండిన కూరల్లో పప్పుల్లో కొబ్బరి నూనె కలిపి తీసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు త్వరగా కరిగిపోతుంది. కొద్దిగా తేనే, కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. మనలో చాలామంది మాటల మధ్య ఎక్కువగా బరువు తగ్గించే చిట్కాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఎవ్వరు బరువు తగ్గించడంలో, నూనెలు గురించి, వాటి ప్రాముఖ్యత ల గురించి చర్చించారు. కానీ శరీర బరువు తగ్గించడంలో కొబ్బరి నూనే సహాయపడుతుందని, అది నిజమని నిపుణులు నమ్ముతున్నారు. కాబట్టి ఆహార పదార్థాల్లో రోజుకు రెండు నుంచి మూడు చెంచాల పాటు కొబ్బరినూనె వాడటం మంచిది. రెండు లేదా మూడు చెంచాల కొబ్బరి నూనెను ఆహారంలో ఉపయోగించడం వలన వారం రోజుల్లో స్నాక్స్‌ తినడానికి దూరంగా ఉంటారు.
Also Read : Health Tips: చలిలో వాకింగ్ చేస్తున్నారా? అయితే మీకు ఈ వ్యాధి రావడం ఖాయం

రోజు తీసుకునే కాలరీల సంఖ్యను తగ్గించడం వలన శరీర బరువు తగ్గుతారు. దీని కోసం కొబ్బరి నూనె తీసుకోవడం క్షేమం అని చెప్పవచ్చు. రోజు పాటించే ఆహార ప్రణాళికలో కొబ్బరి నూనెను వాడటం వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా తీసుకునే కాలరీలు తగ్గించబడటమే కాకుండా కాలరీల వినియోగాన్ని పెంచినవారవుతారు. శరీర హార్మోన్ల స్థాయిలో అసమతుల్యత వలన చాలా మందిలో శరీర బరువు పెరగడం మనం గమనిస్తూ ఉంటాం. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు పదార్థాలు హార్మోన్ల స్థాయిలను స్థిమితంగా ఉంచి, మానసిక కల్లోలాలు కలగకుండా చేసి అన్ని విధాల ఆరోగ్యాన్ని పెంచుతుంది. కొబ్బరి నూనె, శరీర హార్మోన్లలో కలిగే అసమతుల్యతలను నియంత్రించి, శరీర బరువు తగ్గడానికి ప్రోత్సహించి లక్ష్య ఛేదన కు సహాయపడుతుంది.