NTV Telugu Site icon

National Walking Day 2023: ఎంత నడిస్తే.. మీ గుండె అంత పదిలం

Walking Benifits

Walking Benifits

National Walking Day 2023: నడక శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. మీరు ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే నడకని మించిన ఎక్సర్ సైజ్ మరొకటి లేదు. డాక్టర్ల , ఫిట్‌నెస్ నిపుణులు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. నడక మొత్తం శరీరాన్ని కదిలిస్తుంది. అన్ని అవయవాలు వేగంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. రోజూ నడిస్తే మరే ఇతర వ్యాయామం అవసరం లేదు. ఏ వయసు వారైనా నడవవచ్చు. నడక బరువును అదుపులో ఉంచుతుంది. నడక వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. అందుకే చిన్నపిల్లలు, పెద్దలు, సీనియర్‌ సిటిజన్‌లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడవాలి.

నేషనల్ వాకింగ్ డే ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు నడక గురించి అవగాహన కలిగి ఉండాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి బుధవారం నాడు జరుపుకుంటారు. ఈ రోజును 2007లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రారంభించింది. శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం లక్ష్యం. కేవలం 20 నిమిషాల నడకతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

Read Also: Covid 19: దేశంలో 5 వేలను దాటిన రోజూవారీ కోవిడ్ కేసులు..

నడక గుండెకు చాలా మేలు చేస్తుంది. నిత్యం నడిచే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. నడక వల్ల రక్తప్రసరణ పెరిగి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నడక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే రోజూ వాకింగ్ చేయడం ద్వారా శరీరానికి ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. నడక ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం బాగా జరుగుతుంది. దీని కారణంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. నడక ద్వారా జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. పొట్ట శుభ్రంగా ఉంటుంది. ప్రతిరోజూ నడవడం ద్వారా బరువు తగ్గుతారు.

Read Also: Kakani Govardhan Reddy: పబ్లిసిటీ కోసమే కోటంరెడ్డి హంగామా.. నాలుగేళ్లలో గుర్తుకు రాలేదా?

నడక ద్వారా శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు తయారవుతాయి. దీని కారణంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. నడక మనస్సును పదును చేస్తుంది. నడిచేటప్పుడు మెదడులో మార్పులు ఉంటాయి. ఇవి మెదడును ప్రభావితం చేస్తుంది. నడక మెదడు, నాడీ వ్యవస్థలో ఉండే హార్మోన్లను పెంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 10,000 అడుగులు అంటే 6 నుంచి 7 కిలోమీటర్లు నడవాలి. హెవీ వర్కవుట్ లేదా జిమ్ రొటీన్‌ని అనుసరించలేని వారు నెమ్మదిగా నడవాలని చెబుతారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది.