NTV Telugu Site icon

Ashes 1st Test: ఇదేం ఫీల్డింగ్ రా బాబు.. ఇలాంటిది నేనెక్కడ చూడలేదు..

Engvsaus

Engvsaus

యాషెస్‌ సిరీస్‌ 2023 తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తన కెప్టెన్సీ నైపుణ్యాన్నంతా ఒక్కసారిగా బయటకు తీశాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో పదేపదే బౌలర్లను మార్చి ఒకింత సక్సెస్‌ సాధించిన బెన్ స్టోక్స్‌.. ఫీల్డింగ్‌ సెట్టింగ్ విషయంలో తన వైవిధ్యాన్నంతా రంగరించి మరీ ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. తొలుత స్టీవ్‌ స్మిత్‌ను ఔట్‌ చేసేందుకు నాలుగు స్లిప్‌లు, రెండు లెగ్‌ స్లిప్‌లు పెట్టిన స్టోక్స్‌.. ఆట మూడో రోజు (జూన్‌ 18) ఉస్మాన్‌ ఖ్వాజాపై ఒత్తిడి పెట్టేందుకు క్వార్టర్‌ సర్కిల్‌లో ఆరుగురు ఫీల్డర్లను మొహరించాడు. స్టోక్స్‌ ఫీల్డ్‌ సెట్టింగ్‌ వల్ల ఒత్తిడికి లోనైన ఖ్వాజా.. వారిపై నుంచి భారీ షాట్‌ అడేందుకు ప్రయత్నించి రాబిన్సన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. ఇలాంటి వెరైటీ ఫీల్డ్‌ సెటింగ్‌ ద్వారా.. ఆసీస్‌ ప్రధాన బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చి ఔటయ్యేలా బెన్ స్టోక్స్‌ చేశాడు.

Read Also: Devendra Fadnavis: జాతీయవాద ముస్లింలు ఎవరూ ఔరంగజేబును తమ నాయకుడిగా గుర్తించరు..

కాగా, 311/5 స్కోర్‌ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. మరో 75 పరుగులు జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయి కేవలం 386 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్‌ ఖ్వాజా (141) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ను దాదాపుగా చేరుకునేంతా పని చేశాడు. ఖ్వాజాతో పాటు ట్రవిస్‌ హెడ్‌ (50), కామారూన్‌ గ్రీన్‌ (38), అలెక్స్‌ క్యారీ (66), పాట్‌ కమిన్స్‌ (34) పోరాడటంతో ఇంగ్లండ్‌కు జస్ట్ 7 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం మాత్రమే దక్కింది.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వార్నర్‌ (9), లబూషేన్‌ (0), స్టీవ్‌ స్మిత్‌ (16), లయోన్‌ (1), బోలండ్‌ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టువర్ట్‌ బ్రాడ్‌, రాబిన్సన్‌ తలో 3 వికెట్లు, మొయిన్‌ అలీ 2 వికెట్లు, ఆండర్సన్‌, స్టోక్స్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. రూట్‌ (118 నాటౌట్‌), జాక్‌ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లీష్ జట్టు డిక్లేర్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయోన్‌ 4, హాజిల్‌వుడ్‌ 2, బోలండ్‌, గ్రీన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

Show comments