NTV Telugu Site icon

Bellamkonda Sreenivas: మూడు సినిమాలు లైన్‌లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇక రచ్చ రచ్చే!

Bellamkonda Sreenivas

Bellamkonda Sreenivas

Bellamkonda Sreenivas Upcoming Movies Updates: నిర్మాత బెల్లంకొండ సురేష్ వార‌సుడిగా 2014లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు, సాక్షం, అల్లుడు అదుర్స్, సీత, కవచం వంటి చిత్రాలు నిరాశపరిచాయి. మధ్యలో జయ జానకీ నాయక, రాక్షసుడు సినిమాలు హిట్‌లుగా నిలిచాయి. ఇక ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేయగా.. ఘోర పరాజయాన్ని చవి చూసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు పూర్తైంది. ప్రస్తుతం అతడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘టైస‌న్ నాయుడు’. భీమ్లానాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. 14 రీల్స్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్‌తో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా టైస‌న్ నాయుడు షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు‌ మూన్‌షైన్ పిక్చర్స్‌తో సినిమాలు చేయనున్నాడు. వీటికోసం మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్‌ కనిపించనున్నాడని తెలుస్తుంది.

Also Read: Love Mouli Trailer: నవదీప్‌ ‘లవ్‌ మౌళి’ ట్రైలర్‌.. బోల్డ్‌ కంటెంట్‌ బోలెడుంది!

బెల్లంకొండ శ్రీనివాస్ న‌టిస్తున్న ఈ మూడు సినిమాలు కూడా చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేస్తాయి అని అంటున్నారు. యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్‌ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌.. ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్‌ బ్యాక్‌ మూవీలు అవుతున్నాయి అని ఆశిస్తున్నారు. మంచి యాక్షన్స్, డ్యాన్సులు చేసే బెల్లంకొండకు మంచి స్క్రిప్ట్ ఇప్పటికైనా దొరుకుతుందో చూడాలి.

Show comments