Site icon NTV Telugu

EX MLA Jaleel Khan: బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలి..

Jaleel Khan

Jaleel Khan

EX MLA Jaleel Khan: బెజవాడ పశ్చిమలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలని.. ఇవాళ ర్యాలీ బల ప్రదర్శన కాదు మైనార్టీల వాయిస్ అని ఆయన పేర్కొన్నారు. పొత్తులో కావాలంటే వేరే చోట జనసేన టికెట్ తీసుకోవచ్చని.. మాకు ఉన్న సీట్లు తీసుకుని మైనార్టీల నోట్లో మట్టి కొడతారా అంటూ ప్రశ్నించారు.

Read Also: TS Vs AP: తెలంగాణలో ఏపీ పోలీసుల వ్యవహారం.. ఉద్యోగానికి సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్

ఎన్నికలప్పుడు వేరే వాళ్ళు టికెట్లను అడగటం సహజమన్నారు. పశ్చిమ టికెట్ మైనార్టీలకు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు టికెట్ మాకు ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. నాకు హెల్త్ బాలేదని చెప్పటం ఒక రూమర్ అంటూ ఆయన తెలిపారు. సినిమా ఇపుడే మొదలైంది, టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుందో క్లైమాక్స్‌లో తెలుస్తుందని టీడీపీ నేత జలీల్‌ఖాన్ వెల్లడించారు.

 

Exit mobile version