Site icon NTV Telugu

Haryana: ఆ రాష్ట్రంలోని ఆఫీసుల్లో బీర్‌, వైన్‌ సర్వ్‌..!

Haryana

Haryana

ఓ రాష్ట్రంలోని ఆఫీసుల్లో బీర్, వైన్ సర్వ చేసేలా పర్మిషన్ కోసం ప్రత్యేక పాలసీని కూడా తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేట్ కార్యాలయాల్లో వైన్, బీర్ వంటి తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డింక్స్ ని సర్వ్ చేసేలా పర్మిషన్ ఇస్తున్నారు. ఈ పాలసీ నిబంధన ప్రకారం కార్పోరేట్ కార్యాలయాల్లో సుమారు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ లేదా తినుబండరాలు ఉండాలి అని తెలిపింది.

Also Read : Adah Sharma: నా నిజాయితీని అపహాస్యం చేశారు.. బెదిరించారు

ఈ మేరకు హర్యానాలోని అక్కడి క్యాబినేట్ మంగళవారం ఈ కొత్త పాలసీ 2023-24కి ఆమోదం తెలిపింది. రిటైల్ పర్మిట్ రుసుము కింద పర్యావరణం, జంతు సంక్షేమ నిధి కోసం రూ. 400 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం టార్గెట్ ను పెట్టుకుంది. ఈ మేరకు సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత విడదల చేసిన అధికారిక ప్రకటనలో దీని గురించి వివరించారు.

Also Read : Bhatti Vikramarka : తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం పీక్కు తింటారు

కొత్త పాలసీలో దేశీయ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఇంపోర్టెడ్ ఫారిన్ లిక్కర్ బేసిక్ కోటాను కూడా పెంచారు. దీంతో దేశీయ మద్యం, IMFL పై ఎక్సైజ్ సుంకం రేట్లలో నామమాత్రపు పెరుగుదల ఉంది. ఈ పెంపుతో ఎక్సైజ్ పై ఆదాయానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అలాగే సూక్ష్మ మధ్య తరహా రంగాన్ని ప్రోత్సహించడానికి చిన్న షాపులకు లైసెన్స్ ఫీజును తగ్గించింది.

Also Read : Fakes Kidnapping: పరీక్షల్లో ఫెయిల్ అయింది.. కిడ్నాప్ డ్రామాకు తెర లేపింది..

హర్యానా రాష్ట్రంలో వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకు వైన్ తయారీ కేంద్రాల పర్యవేక్షక రుసుమును ప్రభుత్వం తగ్గించినట్లు వెల్లడించారు. పంచకులలోని శ్రీ మాతా మానస దేవి ఆలయం చుట్టుపక్కల.. సర్కార్ నోటిఫై చేసిన పవిత్ర ప్రాంతాలు, గురుకులాలు ఉన్న గ్రామాలలో మద్యం దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది.

Exit mobile version