Tamilnadu: తమిళనాడులో దారుణం జరిగింది. రోడ్డుపై సడన్ గా ఓ బీర్ ట్రక్కు బోల్తా పడింది. అందులో నుంచి బీర్ కాటన్లు రోడ్డు వెడల్పునా పడిపోయాయి. టక్కులో ఉన్న కాటన్ల నుంచి బీర్లు బయటపడి చాలా వరకు పగిలిపోయాయి. రోడ్డు పక్కనే బీర్ వరదలుగా పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డు యాక్సిడెంట్ అయిన స్థలానికి పరుగులు తీశారు. చేతిలో పట్టినన్ని బీర్ బాటిళ్లు పట్టుకుని తీసుకెళ్లారు.
Read Also:DC vs GT: పోరాడి ఓడిన గుజరాత్.. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం
తమిళనాడులోని బందరపల్లి ఫ్లై ఓవర్ వద్ద బీర్ కాటన్లను తీసుకెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఆ ఫ్లై ఓవర్ వద్ద ట్రక్కు పై డ్రైవర్‌కు వాహనం పై నియంత్రణ కోల్పోయింది. ఫ్లై ఓవర్ పైనే బోల్తా పడింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి వెళ్లారు. రోడ్డు పక్కనే బీర్ బాటిళ్లు, కాటన్లతో చిందరవందరగా మారిపోయింది. దీంతో పోలీసులు ఆ కాటన్లు, బీర్లను తొలగించడానికి జేసీబీని సంఘటన జరిగిన ప్రదేశానికి తీసుకువచ్చారు.
Read Also:DC vs GT: చెమటోడుస్తున్న గుజరాత్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
జేసీబీ వాటిని అన్నింటిని పక్కకు నెట్టేయడానికి ఉపక్రమిస్తుండగా.. స్థానికులు స్పాట్‌కు వచ్చారు. పరుగులు పెట్టుకుంటూ వచ్చి చేతిలో నాలుగైదు బీర్ బాటిళ్లు పట్టుకుని బయటపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వారి తీరును చూసి షాక్ అయ్యారు. వారిని వారించలేక షాక్‌లో ఉండిపోయారు. క్షణాల్లో అక్కడ పగలకుండా ఉన్న బీర్ బాటిళ్లను తీసుకుని వెళ్లిపోయారు. జేసీబీ అక్కడ మిగిలి ఉన్న చెత్తను తొలగించింది. ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు కాపాడి సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు.