NTV Telugu Site icon

Bears Hulchul: కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్లు హల్‌చల్.. భయం గుప్పిట్లో ప్రజలు

Bears

Bears

Bears Hulchul: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చుట్టుపక్కల ఎలుగుబంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో వాటిని చూసిన ప్రజల్లో భయం నెలకొంది. కుందుర్పి మండలం కరిగానపల్లి, మందలపల్లి, బెస్తరపల్లి గ్రామ శివారు కొండల్లో ఆరు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. ఓ యువకుడు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఎలుగుబంట్లు కనిపించాయి. ఎలుగుబంట్లను తమ సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు ఆ యువకుడు. కళ్యాణదుర్గం పట్టణ శివారులోని ఎన్టీఆర్ కాలనీలో తెల్లవారుజామున ఇళ్ల మధ్యలోకి ఎలుగుబంటి వచ్చింది. ఈ క్రమంలో కళ్యాణదుర్గం చుట్టుపక్కల గ్రామస్థులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

Read Also: Fire Accident: ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీగా చెలరేగిన మంటలు. అగ్నికి ఆహుతైన బోగీలు

Show comments