Site icon NTV Telugu

World Cup 2023: అభిమానులకు శుభవార్త.. మరో 4 లక్షల టికెట్లు!

Odi World Cup 2023 New

Odi World Cup 2023 New

BCCI to release 4 Lakh Tickets for World Cup 2023 on Sep 8: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు శుభవార్త. ఫాన్స్ కోసం మరో 4 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచుతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌ https://tickets.cricketworldcup.comలో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

‘ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ 2023 టికెట్లు పొందవచ్చు. సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటల నుంచి టికెట్ల అమ్మకాలు మొదలవుతాయి. అధికారిక టికెటింగ్‌ వెబ్‌సైట్‌ https:///tickets.cricketworldcup.com నుంచి టికెట్లు కొనుగోలు చేయొచ్చు. మరో దశ టికెట్ల అమ్మకాలు ఎప్పుడుంటాయో త్వరలో చెబుతాం’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే 4 లక్షల టికెట్లలో భారత్‌ ఆడే మ్యాచ్‌ల టికెట్లు ఎన్నో మాత్రం బీసీసీఐ చెప్పలేదు.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

చాలా ఏళ్ల తర్వాత స్వదేశంలో ప్రపంచకప్‌ జరుగుతుండడంతో టికెట్ల కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. టికెట్లు అమ్మకానికి ఉంచిన గంటల్లోనే ‘సోల్డ్‌ అవుట్‌’ అని కనిపిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర సంఘాలతో చర్చించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏ మ్యాచ్‌ కోసం ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.

Exit mobile version