Site icon NTV Telugu

IND vs BAN: బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

Ind

Ind

ఆగస్టులో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో, రెండు జట్ల మధ్య 3 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 3 ODI మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. వన్డే సిరీస్ ఆగస్టు 17 నుంచి ప్రారంభమవుతుంది. టీ20 సిరీస్ ఆగస్టు 26 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటన కోసం భారత జట్టు ఆగస్టు 13న ఢాకా చేరుకుంటుంది.

Also Read:Vizag Steel Plant Workers Indefinite strike: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచి నిరవధిక బంద్‌..

వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్ ఆగస్టు 17న మీర్‌పూర్‌లో, రెండవ మ్యాచ్ ఆగస్టు 20న మీర్‌పూర్‌లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని మూడో వన్డే ఆగస్టు 23న చిట్టగాంగ్‌లో జరుగుతుంది. ఆగస్టు 26 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్ చిట్టగాంగ్‌లో జరుగుతుంది. ఆగస్టు 29, 31 తేదీల్లో జరగనున్న రెండవ, మూడవ T20 మ్యాచ్‌లు మీర్పూర్ గ్రౌండ్ లో జరుగుతాయి. బంగ్లాదేశ్‌లో తొలిసారి టీ20 సిరీస్ భారత్ ఆడనుంది.

వన్డే సిరీస్ షెడ్యూల్

తొలి వన్డే: ఆగస్టు 17
రెండవ వన్డే: ఆగస్టు 20
మూడో వన్డే: ఆగస్టు 23

టీ20 సిరీస్ షెడ్యూల్

మొదటి T20: ఆగస్టు 26
రెండవ టీ20: ఆగస్టు 29
మూడో టీ20: ఆగస్టు 31

Exit mobile version