Site icon NTV Telugu

BCCI President: బీసీసీఐ అధ్యక్షుడి రాజీనామా.. మరి కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టేది ఎవరు..?

Bcci

Bcci

BCCI President: భారత క్రికెట్ నియంత్రణ మండలిలో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమిండియా 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్ని బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న రాజీవ్ శుక్ల తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగే వరకు శుక్లానే బోర్డును నడిపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన బీసీసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలో జరిగింది.

Asia Cup 2025: ఈ జట్టుతో మనం కప్ గెలవలేం.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

అయితే, తాజాగా జాతీయ క్రీడా పాలన చట్టం ఆమోదం పొందిన పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఈ కారణంగా వచ్చే నెలలో బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంతో పాటు ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. కొత్త చట్టం అమల్లోకి రావడానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఎన్నికలను వాయిదా వేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Faria Abdullah : వామ్మో.. చిట్టి ఇలా చూపిస్తే కుర్రాళ్లకు నిద్ర కష్టమే..

టీమిండియా మాజీ ఆటగాళ్ళు కూడా ఈ రేస్ లో ఉన్నారని సమాచారం. గతంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ కూడా గంగూలినే ఎన్నికవుతారని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. మరి రానున్న రోజుల్లో గంగూలి మరోసారి అధ్యక్ష పదవి రేస్ లో నిలుస్తాడా లేడా అనేది వేచి చూడాలి. అయితే, ప్రస్తుతం బిసిసిఐకి డ్రీమ్ 11 తో ఉన్న ఒప్పందం రద్దవ్వడంతో రానున్న రెండున్నర సంవత్సరాల పాటు బోర్డుకి కొత్త స్పాన్సర్ ను వెతకడం ఇప్పుడు అత్యవసరంగా మారింది. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కొత్త స్పాన్సర్షిప్ పెద్ద సవాలుగా మారింది.

Exit mobile version