NTV Telugu Site icon

BCCI: విరాట్, రోహిత్ తీవ్ర విమర్శలు.. బీసీసీఐ కీలక నిర్ణయం!

Bcci

Bcci

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను తొలగించింది. రాబోయే సీజన్‌లో ఈ నిబంధనను రద్దు చేయనున్నట్లు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ ఇప్పటికే తెలియజేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 15న జరుగుతుంది.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రయోగాత్మకంగా ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బీసీసీఐ అమలు చేసింది. ఆపై ఐపీఎల్‌లోకి తీసుకువచ్చింది. ఈ రూల్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. ఐపీఎల్‌లో చాలా మంది కెప్టెన్లు, కోచ్‌లు వ్యతిరేకించారు. భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా విమర్శలు చేశారు. ఆల్‌రౌండర్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చాలా మంది పేర్కొన్నారు. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌తో 12 మంది ప్లేయర్స్ ఆడుతున్నారని, ఆల్‌రౌండర్లకు బదులుగా స్పెషలిస్ట్ బ్యాటర్లు లేదా బౌలర్లు తుది జట్టులో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. విమర్శల నేపథ్యంలో ఇంపాక్ట్ రూల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read: IND vs NZ: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్-న్యూజిలాండ్‌ తొలి టెస్టు కష్టమే!

అయితే ఐపీఎల్‌లో మాత్రం ఇంపాక్ట్ రూల్‌ 2027 సీజన్ వరకు కొనసాగనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెండు బౌన్సర్ల నిబంధనను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. బౌలర్లకు మేలు చేకూర్చే ఈ నిబంధన.. దేశవాళీ టోర్నీలో సహా ఐపీఎఎల్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాది మేలో బీసీసీఐ సెక్రటరీ జై షా ఐపీఎల్‌లో ఈ నిబంధనను టెస్ట్ కేసుగా అభివర్ణించారు. ఇది శాశ్వతం కాదని, దానిని రద్దు చేస్తామని చెప్పారు.

 

Show comments