BCCI Awards 2024: హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల ఫంక్షన్.. ప్రత్యేక అతిథులు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Annual Awards 2024 in Hyderabad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనుంది. జనవరి 23న హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకలకు భారత జట్టుతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా హాజరుకానున్నారు. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. బీసీసీఐ అవార్డుల వేడుక సమయానికి ఇంగ్లండ్ ప్లేయర్స్ హైదరాబాద్‌లోనే ఉండనున్న నేపథ్యంలో వారిని కూడా బీసీసీఐ ఆహ్వానించనుంది.
చివరిసారిగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ 2020 జనవరిలో జరిగింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుక నిలిచిపోయింది. 2018-19 క్రికెట్ ఏడాదికి గానూ అవార్డులను 2020లో బీసీసీఐ అందజేసింది. జస్ప్రీత్ బుమ్రా, పూనమ్ యాదవ్ 2020లో పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకోగా.. కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాలు సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు పాలీ ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికవుతారన్న విషయం తెలిసిందే.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
Also Read: Namrata Shirodkar: మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్! నమ్రత పోస్ట్ వైరల్
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కంటే ముందు భారత్ స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మొహాలి వేదికగా గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. చాలా కాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. ఎందుకంటే జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 ముందు భారత్ ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!