NTV Telugu Site icon

Team India Schedule: స్వదేశంలో జరిగే టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల.. వైజాగ్‌లో మ్యాచ్‌

Teamindia

Teamindia

Team India Schedule: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సంవత్సరానికి భారత పురుషుల క్రికెట్ జట్టు భారతదేశంలో జరిగే మ్యాచ్ లను అధికారికంగా ప్రకటించింది. ఈ సీజన్‌లో భారత జట్టు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో టెస్ట్, వన్డే, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ లలో తలపడనుంది. అక్టోబర్ నెలలో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో అన్ని ఫార్మాట్‌లలో మ్యాచ్‌లు జరగనున్నాయి.

Read Also: RCB vs GT: జోరుమీదున్న బెంగళూరును గుజరాత్ కట్టడి చేస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న గుజరాత్

2025 హోమ్ సీజన్.. అక్టోబర్ 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్‌తో మొదలవుతుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి 14 వరకు కోల్‌కతాలో జరగనుంది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌లు భారత జట్టుకు వెస్టిండీస్‌తో ఆడే మొదటి హోమ్ సిరీస్‌గా ఉంటాయి. ఇక వెస్టిండీస్ సిరీస్ తర్వాత, భారత జట్టు దక్షిణాఫ్రికాతో నవంబర్ 14 నుంచి 18 వరకు ఢిల్లీలో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. రెండవ టెస్ట్ నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతిలో జరగనుంది. టెస్ట్ సిరీస్ తర్వాత, వన్డే సిరీస్ నవంబర్ 30న రాంచీలో మొదలై, డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో రెండవ వన్డే, డిసెంబర్ 6న విశాఖపట్నంలో మూడవ వన్డేతో కొనసాగుతుంది.

Read Also: IPL Records: ఐపీఎల్‌లో ధోని రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్

ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కూడా ఉంటాయి. మొదటి టీ20 డిసెంబర్ 10న బెంగళూరులో, రెండవ టీ20 డిసెంబర్ 12న చెన్నైలో, మూడవ టీ20 డిసెంబర్ 14న ముంబైలో జరగనుంది.