Site icon NTV Telugu

India U19: ఇంగ్లాండ్ పర్యటనకు అండర్-19 జట్టు ప్రకటన.. జట్టులోకి చిచ్చరపిడుగులు ఎంట్రీ..!

India U19

India U19

India U19: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) త్వరలో జరిగే ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించింది. ఈ పర్యటనలో జూన్ 24 నుంచి జూలై 23 వరకు ఐదు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ సిరీస్‌కు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2025 సీజన్‌లో మంచి ప్రతిభ చూపిన అయుష్ మ్హాత్రేను కెప్టెన్‌గా నియమించారు. అలాగే అభిగ్యాన్ కుండును వైస్-కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఐపీఎల్ 2025లో మ్హాత్రే అత్యుత్తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సీజన్ మధ్యలో గాయపడ్డ ఆటగాడికి బదులుగా CSK జట్టులోకి వచ్చిన అతను 6 మ్యాచ్‌ల్లో 206 పరుగులు సాధించాడు.

Read Also: Operation Sindoor: పాఠ్యాంశంగా ఆపరేషన్ సిందూర్.. సిలబస్‌గా చేర్చిన మదర్సాల

ఈ ఐపీఎల్ సీజన్‌లో మరో సంచలనం వైభవ్ సూర్యవంశీ. అతను ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో అరంగేట్రం చేసి 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేశాడు. 36 సగటుతో, 206.55 స్ట్రైక్ రేట్‌తో ఒక శతకం, ఒక అర్ధశతకం చేశాడు. ముఖ్యంగా 34 బంతుల్లో శతకం సాధించి టీమిండియా తలుపు తట్టాడు. ఈ ఇద్దరి ఆటగాళ్లపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి ఉండడంతో, రెడ్ బాల్ క్రికెట్‌లో వారి సామర్థ్యాలను పరీక్షించనున్నారు. వారితో పాటు హర్వంశ్ సింగ్, కనిష్క్ చౌహాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్ వంటి ఆటగాళ్లు కూడా ఇంగ్లాండ్ పర్యటనలో కీలకంగా మారనున్నారు.

Read Also: Sthree Nidhi App: పేదలకు 48 గంటల్లో రుణాల మంజూరు.. స్త్రీనిధి మొబైల్ యాప్ లాంచ్..!

భారత అండర్-19 జట్టు:
అయుష్ మ్హాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ ఛావ్డా, రాహుల్ కుమార్, అభిగ్యాన్ కుండు (వైస్-కెప్టెన్, వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్ ఎస్ అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుద్ధజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఇనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్

స్టాండ్‌బై ఆటగాళ్లు:
నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రపోలే (వికెట్ కీపర్)

షెడ్యూల్:
జూన్ 24: వన్డే వార్మ్-అప్ మ్యాచ్ – లఫ్బరో విశ్వవిద్యాలయం

జూన్ 27: 1వ వన్డే – హోవ్

జూన్ 30: 2వ వన్డే – నార్తాంప్టన్

జులై 2: 3వ వన్డే – నార్తాంప్టన్

జులై 5: 4వ వన్డే – వర్స్టర్

జులై 7: 5వ వన్డే – వర్స్టర్

జులై 12- జులై 15 : 1వ మల్టీ డే మ్యాచ్‌ – బెకనహామ్

జులై 20 (ఆదివారం) – జులై 23 (బుధవారం): 2వ మల్టీ డే మ్యాచ్‌ – చెల్మ్స్‌ఫర్డ్.

Exit mobile version