Site icon NTV Telugu

India Squad: చివరి మూడు టెస్టులకు భారత్ జట్టు ప్రకటన.. కోహ్లీ ఔట్, ఆకాష్ ఇన్!

India Test Team

India Test Team

India Squad for Last Three Tests against England: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ఉదయం ప్రకటించింది. అందరూ ఊహించిన విధంగానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన టెస్ట్ మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండడని, విరాట్ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుందని బీసీసీఐ పేర్కొంది.

గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయిన లోకేష్ రాహుల్, రవీంద్ర జడేజాలు జట్టులోకి వచ్చారు. ఇద్దరికీ బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ వచ్చింది. దేశవాళీ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్‌లను చివరి మూడు టెస్టులకు కూడా బీసీసీఐ కొనసాగించింది. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు.

Also Read: David Warner: రిటైర్మెంట్ ఏజ్‌లో విధ్వంసం.. మొదటి ఆస్ట్రేలియా బ్యాటర్‌గా రికార్డు!

భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (కీపర్), కెఎస్ భరత్ (కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

Exit mobile version