Site icon NTV Telugu

Yemmiganur: ఎమ్మిగనూరు టీడీపీ టికెట్ విషయంలో చంద్రబాబు పునారాలోచన చేయాలి..

Machani

Machani

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్.. చేనేతల బీసీ నేత డాక్టర్ మాచాని సోమనాథ్ కు కేటాయించాలని బీసీ, చేనేత నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read Also: Komatireddy Venkat Reddy: తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం..

ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ను బీసీలకు కేటాయిస్తే.. అఖండ మెజార్టీతో గెలిపించుకొని టీడీపీ అధినేత చంద్రబాబుకి బహుమతి ఇస్తామని.. లేని పక్షంలో మా దారేంటో మేము చూసుకుంటామని తెలియజేశారు. గత కొన్ని నెలలుగా డాక్టర్ మాచాని సోమనాథ్ నియోజకవర్గంలో భారీ ఎత్తున ర్యాలీలో సభలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా.. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కష్టపడిన వారికి టికెట్ ఇవ్వకపోవడం చాలా విచారంగా ఉందని నేతలు తెలియజేశారు.

Read Also: Revanth Reddy: ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా.. 14 సీట్లు గెలుస్తున్నాం

మూడున్నర దశాబ్దాల (1989) అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీ నినాదం బలంగా వినిపిస్తుంది. దీంతో ఎమ్మిగనూరు టీడీపీ టికెట్ పద్మశ్రీ మాచాని సోమప్ప నుండి మాచాని సోమనాథ్ వరకు ప్రజా సేవలో ఉన్న ఎం.జి. కుటుంబానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో.. టీడీపీ టికెట్ మాచాని సోమనాథ్‌కు కేటాయించని పక్షంలో.. చేనేతలమంతా ఏకమై మా దారి మేము చూసుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు టీడీపీ టికెట్ మాచాని సోమనాథ్ గారికి కేటాయిస్తే..! అఖండ మెజార్టీతో గెలిపించి టిడిపి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

Exit mobile version