NTV Telugu Site icon

BC Janardhan Reddy: దాతృత్వం చాటిన బీసీ జనార్థన్ రెడ్డి దంపతులు..

Bc Janardhan Reddy

Bc Janardhan Reddy

ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజ్యమేలిన ఆ గడ్డపై ఇప్పుడు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి. హత్యారాజకీయాలతో అట్టుడుకిపోయిన ఆ నేల ఇప్పుడు దైవ నామస్మరణలతో మార్మోగిపోతుంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన ఆ నాయకుడు… ప్రజలకు సేవ చేయడమే కాదు… లెక్కకు మించిన దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ ధార్మిక సేవలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. ఆయనే బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి. బనగానపల్లెలో ధర్మ పరిరక్షణకు బీసీ జనార్థన్ రెడ్డి పాటుపడుతున్నారు.

B.V. Raghavulu: మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమే..

నంద్యాల జిల్లాలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం బనగానపల్లె నియోజకవర్గం. కాలజ్ఞానం రాసిన పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి నడయాడిన ఈ నేలపై యాగంటి ఉమా మహేశ్వరస్వామి ఆలయం, రవ్వలకొండ, శ్రీ లక్ష్మీ సమేత మద్దిలేటి స్వామివారి ఆలయం వంటి ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలు విలసిల్తుతున్నాయి. ఇటువంటి పుణ్యభూమిలో పలు దేవాలయాలకు ఎన్నో దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ గొప్ప ధార్మిక సేవ చేస్తున్న పుణ్య దంపతులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరా రెడ్డి.

Joe Biden: పుతిన్‌పై బైడెన్ దూషణల పర్వం.. బూతు మాటతో స్పీచ్ స్టార్ట్..!

తాజాగా తమ ఇంటి దైవమైన బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మి మద్దిలేటి స్వామి వార్ల క్షేత్రంలో రూ. 15 లక్షల సొంత నిధులతో మెట్ల మార్గం, పైకప్పు నిర్మాణం చేపట్టి మరోసారి బీసీ జనార్థన్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలోనే రూ.8 లక్షలతో కొండపైకి మెట్ల మార్గం నిర్మించి భక్తుల ఇబ్బందులు తొలగించారు. తాజాగా వేసవి కాలంలో భక్తులు ఇబ్బంది పడకుండా రూ. 7 లక్షలతో మెట్ల మార్గంలో పైకప్పు నిర్మాణం కూడా చేపట్టి తన దయాగుణాన్ని మరోసారి చాటుకున్నారు. బీసీ జనార్థన్ రెడ్డి దాతృత్వంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బనగానపల్లె నియోజకవర్గంలోనే కాకుండా నంద్యాల జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలకు వితరణ అందిస్తూ.. జనార్థన్ రెడ్డి దంపతులు గొప్ప ధార్మిక సేవాతత్పరులుగా నిలుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.