NTV Telugu Site icon

BC Janardhan Reddy: నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నా.. నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా..!

Bc Janardhan Reddy

Bc Janardhan Reddy

Banaganapalli: నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజక వర్గంలోని కొండపేటలోని చార్‌ కమాన్ మస్జీద్ కి సంబందించి, అసంపూర్తిగా ఉన్న కాంప్లెక్స్‌ ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి, బీసీ రాజారెడ్డి గార్ల సహకారంతో 3 లక్షల రూపాయల సొంత నిధులతో 3 గదుల కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా ముస్లిం మత పెద్దలు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.

Read Also: Vishnuvardhan Reddy: 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశా.. అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి పోటీ..!

ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నాను.. బనగానపల్లెలో పేదలకు నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా! అని వెల్లడించారు. నేను బనగానపల్లె ప్రజలకు రుణపడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. కొందరు కావాలనే నాపై తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు అని మండిపడ్డారు. నా కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు అన్ని ఆ దేవుడే చూసుకుంటాడు అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.

Read Also: Raashi Khanna: బ్లూ డ్రెస్సులో రాశి ఖన్నా అదిరిపోయే స్టిల్స్..

ఇక, బనగానపల్లె నియోజకవర్గంలో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమై.. వారి కష్టసుఖాలను అడిగిమరీ తెలుసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వినూత్నంగా బాబు షూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన ఆ నాయకుడు.. ప్రజలకు సేవ చేయడమే కాదు.. లెక్కకు మించిన దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ ధార్మిక సేవలో తనకు తానే సాటి అని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి నిరూపించుకుంటున్నారు.