NTV Telugu Site icon

BB 17 Finale: బిగ్‌బాస్‌ 17 విన్నర్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ.. గట్టి పోటీనిచ్చిన మన్నార చోప్రా!

Bb 17 Finale

Bb 17 Finale

Bigg Boss 17 Grand Finale Winner is Munawar Faruqui: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 17 విజేతగా ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ నిలిచాడు. విజేతగా నిలిచిన మునావర్ రూ.50 లక్షల నగదుతో పాటు విలాసవంతమైన కారును కూడా పొందాడు. రెండో స్థానంలో అభిషేక్ కుమార్, మూడో స్థానంలో మన్నార చోప్రా, నాలుగో స్థానంలో అంకితా లోఖండే నిలిచారు. సల్మాన్ ఖాన్ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ సీజన్ 17 ఆదివారంతో ముగిసింది. ఫైనల్‌ ఎపిసోడ్‌కు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ ప్రత్యేక అతిథులుగా వచ్చారు.

107 రోజుల పాటు బిగ్‌బాస్‌ సీజన్‌ 17 కొనసాగింది. 21 మంది సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఫైనల్‌లో మునావర్‌ ఫారూఖీ, అభిషేక్ కుమార్, మన్నార చోప్రా, అంకితా లోఖండే పోటీ పడ్డారు. అంకిత టైటిల్‌ గెలుస్తుందని భావించినప్పటికీ.. అనుకోని విధంగా ఎలిమినేట్‌ అయ్యారు. మన్నార కూడా గట్టి పోటీనిచ్చారు. పోటీలో చివరిగా మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ అభిషేక్, మునావర్ చేతులు పట్టుకుని స్టేజీపైకి సల్మాన్ ఖాన్ వచ్చారు. ఎంతో ఉత్కంఠతకు దారితీసిన ఫైనల్‌ ఎపిసోడ్‌లో ‘విజేత’ మునావర్ అని సల్మాన్‌ ప్రకటించారు. ట్రోఫీని అందుకున్న మునావర్‌ ప్రేక్షకుల వైపు చూపిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Also Read: Daggubati Family: డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు.. దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు!

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో ‘లాక్ అప్’ 2022 సీజన్‌లో మునావర్‌ ఫరూఖీ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా బిగ్‌బాస్‌ విన్నర్‌గా కూడా నిలిచాడు. ఇక బిగ్‌బాస్‌17వ సీజన్‌లో హైదరాబాద్‌ యువకుడు అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీకాంత్‌ యూట్యూబర్‌గా రాణిస్తున్నాడు. షో ఆరంభం నుంచే అదిరిపోయే ఆటతీరుతో శ్రీకాంత్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుని ఫినాలేకు చేరుకున్నాడు. అయితే పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Show comments