Site icon NTV Telugu

MLA Bhupal Reddy : బస్తీమే సవాల్ కోమటిరెడ్డి.. బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా..

Bhupal Reddy

Bhupal Reddy

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న ( శుక్రవారం ) నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించింది. సభలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ సర్కార్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి వారిపై విమర్శలు గుప్పించారు.

Also Read : Sunil Gavaskar: అతడు కెప్టెన్‌గా ధోనీ మాదిరే ఉంటాడు.. ఆ క్రికెటర్‌పై గవాస్కర్ ప్రశంసలు

కాంగ్రెస్ లో రాజకీయ నిరుద్యోగులు నల్గొండలో నిరుద్యోగ దీక్షకు వచ్చారు అని నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. అంతా ఒకటే అన్నారు, కానీ వేరు వేరుగా వచ్చారు.. మంత్రి గురించి అలీబాబా బృందం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని భూపాల్ రెడ్ది ఎద్దేవా చేశారు. అందరు మంత్రులుగా పని చేశారు.. ఈ జిల్లా కు చేసింది ఏమి లేదు.. చెవులో ముచ్చట్లు చెప్పి రాజశేఖర్ రెడ్డిని సాగనంపిండ్రు గాని అభివృద్ధి చేయలేదు అని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి విమర్శించారు.

Also Read : Agiripally Police Station: ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత

1998 నుండి రాజకీయాల్లో ఉన్న వాళ్ళ స్థితి ఏంటో అందరికి తెలుసు.. పిల్లాయపల్లి, బ్రాహ్మన వెళ్ళేంల ఏమైందో అందరికి తెలుసు.. నల్గొండ అభివృద్ధికి రాజీనామా చేసి, ప్రాణ త్యాగంకు సిద్ధంగా ఉన్నా.. నల్గొండ నడిబొడ్డులో కూర్చుందాం బహిరంగ చర్చకు రా.. మర్రిగూడ బై పాస్ లో వేయాల్సిన ప్లై ఓవర్ ను చర్లపల్లిలో వేసి 32 మంది ప్రాణాలను బలిగొన్నావు.. దుప్పల పల్లి ప్లై ఓవర్ వేసి 11మంది ప్రాణాలు తీసినవ్.. ఐటి హబ్ ప్రారంభంకు సిద్ధమవుతుంది, ఎన్ జీ కళాశాల నిర్మాణమవుతుంది అని నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.

Also Read : AP Ministers Fire: అవి ఎన్టీఆర్ ను చంపిన ఖూనీకోరుల సంబరాలు

కాంగ్రెస్ నాయకులు నల్గొండ జంక్షన్ లలో సెల్ఫీ లు దిగింది నిజం కాదా!.. తమ్ముడి కోసం పాల్వాయి స్రవంతిని నాశనం చేసింది నువ్వు కాదా అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైనార్టీల ఓట్లు వేయించుకుని మోసం చేయలేదా.. బీసీల ఓట్లతో గద్దె నెక్కి వాళ్ళని తొక్కింది నువ్వు కాదా.. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ల ఫ్లెక్సీ లు చింపేసిన వెంకట్ రెడ్డి అవసరానికి బలగం అవతారం ఎత్తుతున్నారా అని భూపాల్ రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డికి సవాల్ విసురుతున్నా.. నల్గొండలో పోటీ చేయి.. నిన్ను ఓడించేందుకు నేను సిద్దంగా ఉన్నాను అంటూ నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.

Exit mobile version