Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Bareilly Digital Arrest Scam 8th Class Boy Saves Family From Cyber Fraud

Digital Arrest Scam: ఫ్యామిలీ మొత్తం 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. తన ఐడియాతో చెక్‌ పెట్టిన 8వ తరగతి విద్యార్థి.. ఖంగుతిన్న కేటుగాళ్లు

Published Date :April 10, 2026 , 12:04 pm
By Sudhakar Ravula
Digital Arrest Scam: ఫ్యామిలీ మొత్తం 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. తన ఐడియాతో చెక్‌ పెట్టిన 8వ తరగతి విద్యార్థి.. ఖంగుతిన్న కేటుగాళ్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Digital Arrest Scam: డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ సైబర్‌ నేరగాళ్లు విసిరే వలలో చిక్కుకోవద్దు.. వారి మాయలో పడొద్దు అంటూ పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా.. ఇంకా.. సైబర్‌ కేటుగాళ్ల వలలో చిక్కుకుని.. డబ్బులు పోగొట్టుకుంటున్నవారు లేకపోలేదు.. అయితే, ఓ స్కూల్‌ విద్యార్థి టైమింగ్‌ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేసింది.. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సైబర్ మోసం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో ఒక జంటను సుమారు 10 గంటల పాటు వీడియో కాల్‌లో బందీలుగా ఉంచిన సైబర్ నేరగాళ్ల కుట్రను, అదే ఇంట్లో ఉన్న ఎనిమిదో తరగతి విద్యార్థి తన చాకచక్యంతో భగ్నం చేశాడు.

ప్రేమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న వ్యాపారవేత్త సంజయ్ సక్సేనాకు ఒక రోజు గుర్తుతెలియని నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను దర్యాప్తు సంస్థ అధికారి అని చెప్పుకుంటూ, సంజయ్ మొబైల్ నంబర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉపయోగించబడిందని ఆరోపించాడు. అంతేకాకుండా వీడియో కాల్‌లో యూనిఫామ్ ధరించి కనిపిస్తూ, అరెస్ట్ వారెంట్ చూపించి భయపెట్టాడు. ఈ నాటకంతో భయాందోళనకు గురైన ఆ జంటను సైబర్ నేరగాళ్లు నిరంతరం వీడియో కాల్‌లో ఉంచి “డిజిటల్ అరెస్ట్” పేరిట మానసికంగా బంధించారు. ఇంటి నుండి బయటకు వెళ్లొద్దని, ప్రతి పని కెమెరా ముందు చేయాలని, కాల్‌ను ఎప్పటికప్పుడు ఆన్‌లో ఉంచాలని ఒత్తిడి చేశారు. భోజనం చేసినా, నిద్రపోయినా కాల్ డిస్కనెక్ట్ చేయొద్దని హెచ్చరించారు.

ఇలా సుమారు 10 గంటల పాటు ఆ జంటను భయపెట్టిన మోసగాళ్లు, వారి బ్యాంక్ వివరాలను కూడా సేకరించి డబ్బు దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న సంజయ్ కుమారుడు తన్మయ్‌కు ఇది మోసమని అనుమానం వచ్చింది. అతను తన తండ్రికి చెప్పడానికి ప్రయత్నించినా, భయంతో అతడు వినలేదు. చివరికి అర్ధరాత్రి సమయంలో తన్మయ్ ధైర్యంగా ముందడుగు వేసి తన మొబైల్ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టాడు. దీంతో వెంటనే వీడియో కాల్ కట్ అయి, సైబర్ నేరగాళ్ల కుట్ర విఫలమైంది. ఈ చిన్న చర్యతో భారీ ఆర్థిక నష్టం తప్పింది.

ఇక, తర్వాత రోజు ఉదయం ఆ కుటుంబం ప్రేమ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఇలాంటి వీడియో కాల్స్ లేదా బెదిరింపులు వచ్చినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఈ ఘటనలో చిన్నారి తన్మయ్ చూపిన తెలివితేటలు, ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అతని సమయోచిత నిర్ణయం వల్ల ఒక పెద్ద సైబర్ మోసం తప్పినట్టు అయ్యింది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 8th class boy saves family
  • bank fraud prevention
  • Bareilly digital arrest scam
  • cyber crime news India
  • cyber fraud India

తాజావార్తలు

  • Digital Arrest Scam: ఫ్యామిలీ మొత్తం 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. తన ఐడియాతో చెక్‌ పెట్టిన 8వ తరగతి విద్యార్థి.. ఖంగుతిన్న కేటుగాళ్లు

  • Iran-US Talks: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. పాకిస్థాన్‌లో అమెరికాతో శాంతి చర్చలకు డుమ్మా!

  • Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?

  • Minister Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు..

  • Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions