బాపట్లలో గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న వివాదాలపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే కోన రఘుపతి. దళిత సోదరులను కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు…ఎవరో నా మాటలు వక్రీకరించారు.. బాపట్ల పార్లమెంట్ నుండి పొన్నూరు ను వేరు చేశారని ఆవేదన మాత్రమే నేను తెలిపాను.. నా మాటల వల్ల దళిత సోదరులు నొచ్చుకొని ఉంటే నేను క్షమాపణ కోరుతున్నాను అన్నారు కోన రఘుపతి. బాపట్లలో కులాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు…. రాజకీయ పార్టీల ట్రాప్ లో దళిత సోదరులు పడవద్దని కోరారు. ఈమేరకు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వీడియో విడుదల చేశారు.
ఇటీవల కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడు కావడం దురదృష్టకరమని.. సంతనూతలపాడును బాపట్ల పార్లమెంట్‌లో కలిపారరి రఘుపతి అన్నారు. లేదంటే పొన్నూరుతో కలిసి బాపట్ల ఓసీ పార్లమెంట్‌గా ఉండేదన్నారు. బాపట్ల జిల్లా ఏడాదైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో కోన రఘుపతి ఈ తరహా కామెంట్లు చేశారు. నెల్లూరును ఓసీ చేయడానికి బాపట్లను ఎస్సీ రిజర్వ్ చేశారన్నారు కోన రఘుపతి.
Read Also:Israel: ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తత.. ఒకరిపై ఒకరు రాకెట్, వైమానిక దాడులు
నెల్లూరు ఎస్సీ రిజర్వ్ ఉంటే బాపట్లకు మార్చారని.. సంతనూతలపాడును బాపట్ల పార్లమెంట్‌కు కలిపి.. పొన్నూరును తీసుకెళ్లి గుంటూరు పార్లమెంట్‌లో కలిపారన్నారు. లేకపోతే పొన్నూరుతో కలిపిన బాపట్ల పార్లమెంట్‌తో జిల్లాగా ఏర్పడేది అన్నారు. బాపట్ల ఎస్సీ రిజర్వ్ కావం చారిత్రక తప్పిదంగా వ్యాఖ్యానించారు రఘుపతి. ఈ వ్యవహారంలో.. నియోజకవర్గాల పునర్విభజన కమిటీలో ఉన్న జేడీ శీలం కీలకపాత్ర పోషించారని చెప్పారు. రఘుపతి మాట్లాడిన మాటలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. రఘుపతి దళితుల్ని కించపరిచారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ వివాదం నేపథ్యంలో రఘుపతి వివరణ ఇచ్చారు. దీనిపై దళిత సంఘాలు ఏమంటాయో చూడాలి.