BOB SO: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 1267 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడు (జనవరి 17) చివరి తేదీ. కాబట్టి ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం అప్లికేషన్ ను ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చేసుకోవాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అవసరమైన అర్హతలు ఏమిటి? లాంటి పూర్తి విశేషాలను చూద్దాం.
Also Read: TVS iQube EV Scooter: ఆలోచించిన ఆశాభంగం.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ.20 వేల డిస్కౌంట్
దరఖాస్తు చేసుకొనే వారికి వయస్సు 24 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, ఒక్కో పోస్టుకు ప్రత్యేకంగా వయోపరిమితిని నిర్ణయించారు. SC, ST, OBC రిజర్వ్‌డ్ కేటగిరీ దరఖాస్తుదారులకు కూడా వయో సడలింపు ఉంది. వివిధ పోస్టులకు వేర్వేరుగా విద్యార్హతలను నిర్దేశించారు. ఇక దరఖాస్తు చేసుకొనే వారు జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 600 + GST + గేట్‌వే ఛార్జీలు చెల్లించాలి. ఇక SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము కేవలం రూ. 100 + GST + గేట్‌వే ఛార్జీ చెల్లించాలి.
Also Read: Realme 14 Pro Series: ప్రపంచంలో మొట్టమొదటి రంగులు మారే ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్స్ ఇవే
ఇక ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ చూస్తే.. మొదటి దశలో అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్షకు హాజరు ఉంటుంది. దీనిలో అర్హత సాధించినవారు గ్రూప్ డిస్కషన్ (GD)కు ఎంపిక అవుతారు. అక్కడ కూడా అర్హత సాధించిన వారు తుది ఎంపిక కోసం అభ్యర్థుల వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఈ దశలో అభ్యర్థుల వ్యక్తిగత, వృత్తిపరమైన సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఇక ఈ పోస్ట్ అప్లై చేయడానికి ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ను ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ‘కెరీర్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఆపై ‘కరెంట్ ఓపెనింగ్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, రిక్రూట్‌మెంట్ సంబంధిత లింక్‌కి వెళ్లండి. ఇప్పుడు మీరు ‘క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్’ పై క్లిక్ చేసి, మీ సమాచారాన్ని అందించాలి. దీని తర్వాత అప్లికేషన్ పూర్తి చేయాలి. ఆపై అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. చివరగాదరఖాస్తు రుసుమును చెల్లించండి. తర్వాత అప్లికేషన్ సమర్పించి, భవిష్యత్తు కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.