NTV Telugu Site icon

Bank Holidays: ఏప్రిల్‌ నెలలో తెలుగు రాష్ట్రాల బ్యాంకుల సెలువు లిస్ట్ ఇదే!

Bank Holidays

Bank Holidays

Bank Holidays: భారతదేశంలో బ్యాంకింగ్ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ, సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలంటే బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండేది. అయితే ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడంతో బిల్లులు చెల్లించడం, డబ్బు బదిలీ చేయడం, ఖాతాల వివరాలను తనిఖీ చేయడం వంటి లావాదేవీలు చాలా సులభమయ్యాయి. అయితే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందడం, లాకర్ సదుపాయం ఉపయోగించడం, ఇలా కొన్ని పనుల కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పనిసరి. అయితే, అవసరం కొద్దీ బ్యాంక్‌కు వెళ్లినప్పుడు సెలవు దినం అయ్యి ఉంటే అసౌకర్యానికి గురికావడం చాలా మంది ఎదుర్కొనే సమస్య. అందుకే, బ్యాంక్ సెలవులను ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం.

Read Also: Andhra Pradesh: సెలవు రోజుల్లోనూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు.. భారీ ఆదాయం..

మరి రాబోయే ఏప్రిల్‌ నెలలో తెలుగు రాష్ట్రాల బ్యాంకులు దాదాపు 15 రోజుల పాటు మూసివేయబడనున్నాయి. శనివారం, ఆదివారాలతో పాటు.. పండుగలు, ప్రత్యేక రోజులు ఉండటంతో బ్యాంకులు ఎక్కువగా మూతపడనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా పండుగల ప్రాముఖ్యతను బట్టి సెలవుల సంఖ్యలో తేడా ఉండొచ్చు. మరి ఏప్రిల్ 2025 బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి.

ఏప్రిల్‌ 1: ఆర్థిక సంవత్సర ప్రారంభ దినోత్సవం. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్‌ 5: బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి. తెలంగాణలో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్‌ 14: అంబేడ్కర్‌ జయంతి. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్‌ 18: గుడ్‌ ఫ్రైడే. ఈ రోజున కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

Read Also: Uttam Kumar Reddy : తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు

ఇలా మొత్తంగా తెలంగాణలో ఏప్రిల్‌ 1, 5, 14, 18తో పాటు శని, ఆదివారాలను కలిపి 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 1, 14, 18తో పాటు శని, ఆదివారాలను కలిపి 10 రోజులు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి ఏప్రిల్‌లో బ్యాంకులకు ఎక్కువ సెలవులు ఉన్న కారణంగా, బ్యాంకింగ్ అవసరాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా నగదు డిపాజిట్‌, విత్‌డ్రాయల్‌, చెక్కు క్లియరెన్స్‌, లోన్ రిక్వెస్ట్ వంటి ముఖ్యమైన పనులను ముందుగా చేసుకోవడం మంచిది. బ్యాంక్‌కు వెళ్లే ముందు బ్యాంకు పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడం ద్వారా అనవసరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చు.