Anganwadi Centers: రంగు పడుద్ది.. ఆ గుడ్లపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ముద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anganwadi Centers: చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అంగన్‌వాడీల్లో పోషకాహార కిట్‌లను అందజేస్తుంది. మధ్యాహ్న భోజనం, గుడ్లు కూడా అందిస్తున్నారు. కాగా.. అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ నిత్యం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతోంది. అయితే.. అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన గుడ్లు దారిమళ్లుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలో పంచుతున్న గుడ్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు రంగుల ముద్రలు వేయాలని నిర్ణయించింది సర్కార్. గుడ్లు పక్కదారి పట్టకుండా రంగుల స్టాంపులు వేయాలని నిర్ణయించారు. జోన్ నంబర్‌తో కూడిన గుడ్లకు ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగులు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.
Read also: Yogi Adityanath: పాకిస్తాన్ వెంట ఎవరు ఉండరు.. పీఓకే భారత్‌లో భాగం కావాలనుకుంటోంది..
Also Read
- Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
- FCRA Bill: 'మా చట్టాల గురించి మీకెందుకు?'.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
- TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
ఈ గుడ్లకు నెలకు మూడుసార్లు రంగులు వేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాల్లో కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. మొదటి 10 రోజులలో నెమలి నీలం, రెండవ 10 రోజులలో ఎరుపు, మూడవ 10 రోజులలో ఆకుపచ్చ రంగు. ఇది గుడ్డు బరువు, ఎత్తు మరియు పొడవుకు సంబంధించి స్పష్టమైన నియమాలను నిర్దేశిస్తుంది. అగ్మార్క్ నిబంధనల ప్రకారం గుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాములు ఉండాలని స్పష్టం చేశారు. 10 గుడ్లను ఒక యూనిట్‌గా పరిగణిస్తే వాటి బరువు 450 గ్రాముల నుంచి 525 గ్రాముల వరకు ఉండాలి. గుడ్డులోని తెల్లసొన పగలకుండా చూసుకోవాలని సూచించారు. గుడ్డు 16 మి.మీ వ్యాసం, 3 మి.మీ ఎత్తు ఉండాలని స్పష్టం చేశారు. గుడ్లు సరఫరా చేసే కంపెనీ గోదాముల్లో గుడ్ల నాణ్యత కోసం ల్యాబ్ ఉండాలి. పంపిణీ ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు రిజిస్టర్‌ను నిర్వహించాలని సిఫార్సు చేయబడింది. తక్కువ బరువు, నాణ్యత లేని గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ టెండర్లను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
Priya Prakash Varrier Cleavage Pics: ప్రియా ప్రకాష్ వారియర్ క్లీవేజ్ షో.. హాట్ గ్లామర్‌తో పిచ్చెక్కిస్తున్న వింక్ గర్ల్!
తాజావార్తలు
-
Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
-
Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!