Site icon NTV Telugu

India- Bangladesh: నేడు భారత్‌లో బంగ్లాదేశ్‌ ప్రధాని పర్యటన.. కీలక అంశాలపై చర్చ..!

Ban Pm

Ban Pm

India- Bangladesh: ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశాన్ని సందర్శించనున్నారు. భారత్ లో మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యూఢిల్లీకి వచ్చిన మొదటి విదేశీ అతిథి పీఎం హసీనా.. కాగా, ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ఆమె వచ్చారు. ఆ సమయంలో షేక్ హసీనాను భారత్‌లో పర్యటించాల్సిందిగా మోడీ ఆహ్వానించారు. బంగ్లాదేశ్ ప్రధాని వచ్చే నెలలో చైనాకు అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె న్యూఢిల్లీ పర్యటనపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.

Read Also: Kanchenjunga Accident : కాంచన్‌జంగా విపత్తుకు బాధ్యులెవరు? ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో సంచలన విషయాలు

కాగా, ప్రధాని నరేంద్ర మోడీతో షేక్ హసీనా సమావేశం జరుగుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్లను కూడా ఆమె కలవనున్నారు. ప్రధాని మోడీ, షేక్ హసీనాల భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక, బంగ్లాదేశ్ ప్రధాని చైనా పర్యటనకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ద్వైపాక్షిక సమస్యలపై వాణిజ్యంతో పాటు కనెక్టివిటీ సమస్య చాలా ముఖ్యమైనది.. భూటాన్‌, నేపాల్‌తో వ్యాపారం చేసేందుకు బంగ్లాదేశ్‌కు మార్గం కల్పించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. కాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై కూడా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

Exit mobile version