PAK vs BAN: రెండు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్టులో పాకిస్థాన్ క్రికెట్ జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులువుగా సాధించింది. టెస్ట్ ఫార్మాట్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. ఇకపోతే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తన అతి ఉచ్చాహంతో తొలి ఇన్నింగ్స్ ను 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఆతిథ్య జట్టులో సౌద్ షకీల్ (141), మహ్మద్ రిజ్వాన్ (171*) అద్భుత సెంచరీలు చేశారు. మొదట్లో కేవలం 16 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన పాకిస్థాన్ జట్టు ఆ తర్వాత కోలుకుంది. ఇక తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆధిక్యంలో నిలిచింది. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో ముష్ఫికర్ రహీమ్ భారీ సెంచరీ (191) చేశాడు. దింతో బంగ్లాదేశ్ కు తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
Tamil Nadu Accident: బస్సును ఢీకొన్న వ్యాన్.. గాల్లో ఎగిరిపడ్డ ప్రయాణికులు
ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ నిరాశపర్చడంతో జట్టు మొత్తం 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ కు సులువుగా మ్యాచ్ విజయానికి కేవలం 30 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. 30 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి వికెట్ కోల్పోకుండా విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ ను ముగించడంలో మెహదీ హసన్ మిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ తన 11.5 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకుముందు, పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 1 వికెట్ తీసుకున్నాడు.