NTV Telugu Site icon

Bangladesh: షేక్ హసీనా సహా 97 మంది పాస్‌పోర్టులు రద్దు..

Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత దేశం విడిచి భారత్‌లో నివసిస్తున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ఆదేశాల మేరకు షేక్‌ హసీనా సహా 96 మంది పాస్‌పోర్టులను పాస్‌పోర్ట్‌, ఇమ్మిగ్రేషన్‌ విభాగం రద్దు చేసింది. గతేడాది జూలైలో జరిగిన హత్యలలో వారి ప్రమేయం ఉన్నందున చర్యలు తీసుకున్నారు. హసీనాపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) హసీనా, పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక- పౌర అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

READ MORE: CM Chandrababu Security: సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు.. రంగంలోకి కౌంటర్‌ యాక్షన్‌ టీమ్‌లు

ఫారిన్ సర్వీస్ అకాడమీలో మీడియా సమావేశంలో చీఫ్ అడ్వైజర్ ప్రెస్ విభాగం ఈ సంఖ్యను వెల్లడించింది. సీఏ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం, డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అబుల్ కలాం ఆజాద్ మజుందార్ ఈ మేరకు సమాచారం అందించారు. అయితే.. ప్రెస్ వింగ్ పేర్లను ప్రస్తావించలేదు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ ను ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా వదిలి వెళ్లిన తర్వాత కొంతకాలం పాటు వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరో మారు దీనిపై చర్చ మొదలైంది. షేక్ హసీనా అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆ దేశం భారత్‌కు లేఖ రాసింది. న్యాయ ప్రక్రియ కోసం షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి పంపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుకుంటోందని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ అన్నారు.

READ MORE: PranithaSubhash : పెళ్లి తర్వాత కూడా హాట్ ఫొటోస్ తో ప్రణీత హల్ చల్

Show comments