IND vs BAN: భారత్ భయపెడుతోంది.. అయినా మా రికార్డు మెరుగ్గా ఉంది: బంగ్లాదేశ్ కోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh coach Chandika Hathurusingha praises India fearless cricket: భారత్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని, సొంత గడ్డపై ప్రత్యర్థులను భయపెడుతోందని బంగ్లాదేశ్ కోచ్ చండిక హతురుసింగ అన్నాడు. ఇటీవల భారత్‌పై తమ రికార్డు మెరుగ్గా ఉందని, అయితే వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాతో తలపడి గెలవాలంటే ఎంతో కష్టపడాలన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ కోచ్ మాట్లాడాడు.
‘వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగిన భారత్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. జట్టులో స్ట్రైక్ బౌలర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఉత్తమ స్థితికి చేరుకున్నాడు. మిడిల్ ఓవర్లలో అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్‌లో అయితే టాప్ ఆర్డర్ చెలరేగుతోంది. ఎలాంటి భయం, బెరుకు లేని క్రికెట్ ఆడుతున్న భారత్ ప్రత్యర్థులను భయపెడుతోంది. ప్రస్తుతం రోహిత్ సేన క్రికెట్‌ను ఆస్వాదిస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియాకు గొప్ప మద్దతు లభిస్తోంది’ అని బంగ్లాదేశ్ కోచ్ చండిక హతురుసింగ అన్నాడు.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
Also Read: IND vs BAN: నేడు బంగ్లాతో భారత్ మ్యాచ్.. తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులు! 2007 ప్రపంచకప్‌లో షాక్
‘భారత్‌తో మ్యాచ్‌లో మా కెప్టెన్ షకిబ్ అల్ హాసన్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటేనే ఆడతాడు. ఇంకా ఓ స్కాన్ ఫలితం ఇంకా రావాల్సి ఉంది. మ్యాచ్‌కు ముందు అతడు ఆడడంపై నిర్ణయం తీసుకుంటాం. ఇటీవల భారత్‌పై మా రికార్డు మెరుగ్గా ఉంది. అయితే ప్రపంచకప్‌లో టీమిండియాపై గెలవాలంటే ఎంతో కష్టపడాలి. ముఖ్యముగా మా బ్యాటర్లు రాణించాలి. బౌలర్లు త్వరగా వికెట్స్ తీయాలి’ అని చండిక హతురుసింగ పేర్కొన్నాడు. భారత్, బంగ్లాదేశ్ తలపడిన చివరి నాలుగు వన్డేల్లో టీమిండియా మూడు మ్యాచ్‌లలో ఓడింది. చివరగా ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో ఓటమి చవిచూసింది.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!