NTV Telugu Site icon

BANW VS INDW: టీమిండియా బ్యాటర్లకు నరకం చూపించిన బంగ్లా బౌలర్లు.. చివరికి ఇండియాదే సిరీస్..!

Banw Vs Indw

Banw Vs Indw

భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో 3టీ20లు, 3 వన్డేల కోసం అక్కడ పర్యటిస్తుంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌-టీమిండియాల మధ్య ఇవాళ( మంగళవారం) రెండో టీ20 జరిగింది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాను బంగ్లాదేశ్‌ బౌలర్లు పదువైన బంతులతో కట్టడి చేశారు. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించి టీమిండియాకు చుక్కలు చూపించారు.

Read Also: Mallu Ravi : కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు

వీరి ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి జస్ట్ 95 పరుగలు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతూన్‌ 3 వికెట్లు తీయగా.. ఫాతిమా ఖాతూన్‌ 2, మరూఫా అక్తెర్‌, నమిద అక్తెర్‌, రబెయా ఖాన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. భారత మహిళ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఓపెనర్‌ షఫాలీ వర్మ చేసిన 19 పరుగులే టీమిండియా ఇన్సింగ్స్ లో టాప్‌ స్కోర్‌గా నిలిచింది.

Read Also: Uttar Pradesh: పెళ్లి ఆగిపోవడంతో మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం.. నిందితుల్లో మౌలానా….

షఫాలీ సహా స్మృతి మంధన (13), యస్తిక భాటియా (11), దీప్తి శర్మ (10), అమన్‌జోత్‌ కౌర్‌ (14) రెండంకెల స్కోర్లకే పరిమితం అయ్యారు. టీమిండియా స్టార్‌ బ్యాటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ డకౌట్‌ గా వెనుదిరిగింది.. జెమీమా రోడ్రిగెజ్‌ (8), హర్లీన్‌ డియోల్‌ (6)లు కూడా నిరాశపరిచారు. కేవలం 95 పరుగులు చేసిన టీమిండియా తర్వాత బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బంగ్లా బ్యాటర్లను టీమిండియా బౌలర్లు గజగజ వణించారు.. కేవలం 87 పరుగులకే ఆలౌట్ చేసింది. బంగ్లా గెలుపుకు లాస్ట్ ఓవర్లలో 10 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో కీలకమైన షఫాలీ వర్మ మూడు వికెట్లు తీసుకుని మ్యాచ్ ను ముగించింది. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ భారత్ కైవసం చేసుకుంది.

Show comments