Site icon NTV Telugu

BandiSanjay: ప్రశ్నిస్తే… మతతత్వవాదులంటారా?

తెలంగాణ ద్రోహులు అంతా కేసీఆర్ పక్కన ఉన్నారని ఎద్దేవా చేశారు. 24వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన జడ్చర్ల నియోజకవర్గం నక్కలబండ తండాకు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జడ్చర్లలోని 600 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 1500 కోట్ల విలువైన 120 ఎకరాలను కబ్జా చేసిన ఘనులు టీఆర్ఎస్ నేతలేనని అన్నారు.

టీఆర్ఎస్ నేతలు జనాన్ని దోచుకుంటున్నరని అన్నారు. చివరకు పేదల, ఆరె కటికెల భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కేబినెట్ లో వెంచర్ల కబ్జా శాఖను ఏర్పాటు చేస్తారేమో నని ఎద్దేవ చేశారు. కుల వ్రుత్తులను కేసీఆర్ నాశనం చేస్తున్నరు. దీని గురించి ప్రశ్నిస్తే… మతతత్వవాదులంటారా? అంటూ మండిపడ్డారు. నేను బరాబర్ 80 శాతం హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చి హిందూ సంఘటనా శక్తి దమ్మేంటో చూపిస్తానని సవాల్ విసిరారు.

24వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన జడ్చర్ల నియోజకవర్గం నక్కలబండ తండాకు చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం పై విరుచుకు పడ్డారు. సరూర్ నగర్ లో దళిత బిడ్డ నాగరాజు ను అత్యంత దారుణంగా ‘ఎంఐఎం పార్టీ లుచ్చా నా కొడుకులు’ హత్య చేశారు. నాగరాజు భార్య ఆశ్రీన్ సుల్తానా విషయంలో కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. దళితులు, హిందువులపై దాడులు జరిగితే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ లో శాంతిభద్రతల సమస్య వస్తోందని అన్నారు. తెలంగాణలో రంగురంగుల జెండాలకు స్థానం లేదు.. ఎగిరేది కాషాయ జెండానే ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గడీలపాలనను తరిమి కొడుదాం. గడీలలో బంధీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేద్దాం అంటూ బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay : టీఆర్ఎస్ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారు

Exit mobile version