మాజీ మంత్రి హరీష్ రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తారు. ఉద్యమం చేసి ప్రజల్లో అభిమానం ఉన్న నేత అని అన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు.. హరీష్ రావు ప్రజల మనిషి అని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ మాత్రం ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతలు అంటూ, హరీష్ రావు మంచి నాయకుడు కీర్తించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలతో చర్చలు జరిపారా అంటూ మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందించారు.
Read Also: Jio Sound Box : త్వరలో జియో సౌండ్ బాక్స్.. క్షణాల్లో చెల్లింపులు..
హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని బండి సంజయ్ సూచించారు. తాను హరీష్ రావుతో మాట్లాడలేదని.. ఆయన వివాద రహితుడని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆయనొక్కడే మంచి నేత అని కొనియాడారు. బీజేపీలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ ఒక డ్రామా అని విమర్శించారు. బీజేపీలోకి ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయాల్సిందేనని బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also: Chandipura virus: గుజరాత్‌లో ‘‘చండీపురా వైరస్’’ కలకలం.. నలుగురు పిల్లలు మృతి..