NTV Telugu Site icon

Bandi Sanjay: హైకమాండ్ కు ఫిర్యాదులు చేయడం ఇకనైనా ఆపండి..

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణలో మూర్ఖత్వం, కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడాలి అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి నిన్ననే యుద్ధం ప్రారంభించాడు.. కేసీఆర్.. గత ఎన్నికల సందర్భంగా డబుల్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడు.. దీనిపై ప్రశ్నించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాటసింగారం వెళ్తుంటే అడ్డుకుని అరెస్టు చేశారు.. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని బండి సంజయ్ అన్నారు. గత ఎన్నికల హామీలను కేసీఆర్ నిలబెట్టుకునే వరకు బీజేపీ కార్యకర్తలు విడిచిపెట్టరని ఆయన తెలిపాడు.

Read Also: Relationship: అమ్మాయిలని ఆకర్షించుకోవడం ఎలా..? ఇలా చేస్తే ఇష్టపడతారట..!

ముఖ్యమంత్రి ఫాంహౌజ్, ప్రగతిభవన్ లో పడుకున్నాడు.. సచివాలయం నీళ్లలో మునిగిపోతున్నా పట్టించుకోవడం లేదు అని బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నాడని ఫస్ట్ పేజీలో వస్తుందని భావించి దాన్ని డైవర్ట్ చేసేందుకు పీఆర్సీ అంటూ చెబుతున్నాడు.. కేసీఆర్ దరిద్రపు మొఖాన్ని ఫస్ట్ పేజీలో చూపించాలనుకుంటున్నాడు.. ఎన్నికలు సమీపిస్తున్నాయ్ కదా.. అందుకే.. కేసీఆర్ నటించడం కాదు.. ఏకంగా జీవిస్తున్నాడు అని ఆయన తెలిపారు. ఇవాళ కేసీఆర్.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ తో ప్రచారం చేయిస్తున్నాడు.. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి..
ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ కు ఫిర్యాదులు చేయడం ఇకనైనా ఆపేయాలని అన్నాడు.

Read Also: Andhra Pradesh Crime News: ఆటోను దారి మళ్లించిన డ్రైవర్.. మహిళ ఏం చేసిందంటే..?

నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త నాకు సహకరించారు అని బండి సంజయ్ అన్నారు. చాలా కష్టపడి పనిచేశాననే తృప్తి నాకుంది.. అది చాలు అని ఆయన అన్నారు. నయా నిజాం పాలనను అంతమొందించాలన్నారు. నేను అధ్యక్షుడిని అయ్యాక చాలా మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు.. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆయన తెలిపారు. పాతబస్తీలోని బీజేపీ కార్యకర్తలు హీరోలు.. భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గర మీటింగ్ పెట్టే దమ్ము ఎవరికుంది.. కాంగ్రెస్ కు లేదు, బీఆర్ఎస్ కు లేదు.. ఈ రెండు పార్టీలు నమాజ్ చేసి అక్కడ సభలు పెడుతాయి కావచ్చు.. కానీ బీజేపీ భాగ్యలక్ష్మీ అమ్మవారికి మొక్కి సభ పెట్టింది అని ఆయన అన్నారు. అది చార్మినార్ కాదు.. భాగ్యలక్ష్మీ అమ్మవారు కొలువైన భాగ్యనగరం.. పాత బస్తీ మీది కాదురా.. మాదేరా.. ఏ బస్తీ అయినా మాదేరా.. ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

Show comments