Site icon NTV Telugu

Bandi Sanjay : కేరళ స్టోరీ సినిమా సమాజానికి కొన్ని సూచనలు, జాగ్రతలు సూచించింది

Bandi Sanjay, Ktr

Bandi Sanjay, Ktr

కాచిగూడలోని తారకరామ థియేటర్‌లో ది కేరళ స్టోరీ మూవీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేరళ స్టోరీ సినిమా సమాజానికి కొన్ని సూచనలు, జాగ్రతలు సూచించిందన్నారు. కేరళలో నే కాదు దేశ వ్యాప్తంగా హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ఐసీసీ లోబర్చుకుంటుందన్నారు. తెలంగాణ లో కూడా జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేరళలో మూర్ఖత్వం ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఉన్నారని, కమ్యూనిస్ట్ లు వారికి ఈ దేశం మీద నమ్మకం లేదన్నారు. భజరంగ్ దళ్ లాంటి సంస్థలు హిందూ అమ్మాయిలను కాపాడుతుందని, దేశంలో టెర్రరిజం ను ప్రోత్సహించే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు.

Also Read : Priyanka Gandhi : మిత్రులారా అంటూ తెలుగులో మాట్లాడిన ప్రియాంక

చాలా మంది తల్లి దండ్రులు చెప్పిన పట్టించుకోవడం లేదని, హిందూ వాహిని, భజరంగ్ దళ్ కార్యకర్తలు చెప్పిన వినడం లేదన్నారు. ఉల్టా కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు. మైనర్ అమ్మాయిలను సౌదీ నుండి వచ్చి పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళేవారని, ఇది ఖురాన్ లో ఉందా అని ఆయన ప్రశ్నించారు. మోడీ వచ్చాక ఇవన్నీ బందయ్యాయని, ముస్లిం మహిళలు కూడా ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు ఈ సినిమా చూడాలని ఆయన సూచించారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక ఇలాంటి సినిమాలను వారానికి ఒకటి తీస్తామని ఆయన అన్నారు.. ఎలాంటి టాక్స్ లు లేకుండా ప్రదర్శిస్తామని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Jaganannaku Chebudam: జగనన్నకు చెబుదాం… ఏ సమస్యలకు.. ఎలా పరిష్కారం అంటే..?

Exit mobile version