NTV Telugu Site icon

Bandi Sanjay: నేడే కొల్లాపూర్ లో బండి సంజయ్‌ పర్యటన.. షెడ్యూల్ ఇదే

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు కొల్లాపూర్‌లో పర్యటించనున్నారు. బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం గత నెల 8వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ ప్రగతి కోసం ఆయన చేపట్టిన పాదయాత్రను చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామంలో ఆయన ప్రారంభించారు. ఈ పాదయాత్ర గత 35 రోజుల్లో 110 గ్రామాలు, 500 కిలోమీటర్లు కొనసాగింది. ఈ సందర్భంగా నేడు కొల్లాపూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర ముగింపు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

షెడ్యూల్ ఇదే..

బండి సంజయ్ ఢిల్లీ నుంచి 12:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. శంషాబాద్ నుండి కాన్వాయ్ నేరుగా కొల్హాపూర్‌కు బయలుదేరి 3:30 నిమిషాలలో చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ మాధవస్వామి దేవాలయం సమీపంలోని వివేకానంద విగ్రహం వద్ద జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక సాయంత్రం 4.10 నిమిషాలకు విగ్రహం దగ్గరి నుంచి పాదయాత్రలో పాల్గొని కొల్లాపూర్ లోని మెయిన్ రోడ్ ద్వారా 4.30 నిమిషాలకు బహిరంగ సభకు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కొల్లాపూర్ లో బహిరంగ సభలో బండిసంజయ్‌ ప్రసంగించనున్నారు.
VeeraSimhaReddy Public Talk: వీరసింహారెడ్డి రివ్యూ & పబ్లిక్ టాక్