Site icon NTV Telugu

Bandi Sanjay : 2019లో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం

Bandi Sanjay

Bandi Sanjay

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల దుమాల  గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా 10 తరగతి విద్యార్థినిలతో మమేకమై మాట్లాడారు బండి సంజయ్‌. విద్యార్థినులతో పై చదువులు చదివిన తర్వాత మీరు  ఏమవుతారు అని అడుగగా టీచర్, ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని సమాధానం చెప్పిన విద్యార్థులు. ఒక్కొక్క విద్యార్థినిపై కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 1 లక్ష 9 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని విద్యార్థినులకు తెలిపారు బండి సంజయ్. 2019 లో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేశామని, ఎస్టీ సామాజిక వర్గానికి వారు ఉన్నత చదువులు చదివి వారికున్న లక్ష్యాలను నెరవేర్చాలని సంకల్పంతో ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశామని బండి సంజయ్‌ తెలిపారు.

Maa Nanna Superhero: ‘నాన్న’ను గుర్తు చేసేలా నాన్న సాంగ్

దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య పాఠశాలలుంటే తెలంగాణలో 23 పాఠశాలలున్నాయి జిల్లాలోని రెండు పాఠశాలలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా భవనాలు లేని పాఠశాలకు 38 కోట్ల రూపాయలు నక్సల్స్ ప్రాంతాలకు 48 కోట్లతో నూతన భవనాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు బండి సంజయ్‌. ప్రతి పాఠశాలలో 480 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పటివరకు లక్షా ఇరవై వేల మంది ఉన్నత చదువులు చదివారని, తెలంగాణలో ఉన్న 23 ఏకలవ్య పాఠశాలలో 4000 మంది పైచిలుకు విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థులు పై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి నైపుణ్యాలు ప్రోత్సహించాలని పాఠశాలలు ఏర్పాటు చేశామని, విద్యార్థుకు ఉన్నత చదువులు చదివి వారి లక్ష్యాలకు చేరుకొని సమాజానికి మేలు చేయాలని కోరుతున్నామన్నారు.

Ambati Rambabu: చంద్రబాబు వచ్చారు.. జనాన్ని వరదల్లో ముంచారు

Exit mobile version